యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల డిగ్రీ కోర్సులపై కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సులు వ్యవధిని పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకునే అవకాశాన్ని ఇవ్వనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఒక్కో విద్యార్థి అభ్యాస సామర్థ్యం ఒక్కోలా ఉంటుంది. వారి సామర్థ్యాన్ని బట్టి తొందరగా లేదా ఆలస్యంగా కూడా పూర్తిచేయవచ్చు.
ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు
కేవలం రెండేళ్లలోనే..
తొందరగా చదవాలనుకునే వారు యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌తో రెండేళ్లలో కూడా డిగ్రీ పూర్తిచేయవచ్చు. అలాగే ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ పేరుతో నాలుగేళ్లలో కూడా డిగ్రీ కోర్సును పూర్తిచేయవచ్చని తెలిపింది. ఈ డిగ్రీ సర్టిఫికేట్‌తో అన్ని ఉద్యోగాలకు అప్లై చేయవచ్చని, సాధారణ డిగ్రీకి ఉన్న విలువే దీనికి కూడా ఉంటుందని ఛైర్మన్ జగదీశ్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
డిగ్రీ కోర్సును మీ సామర్థ్యాన్ని బట్టి పూర్తి చేయవచ్చు. అయితే విద్యార్థులు మొదటి లేదా రెండో సెమిస్టర్ చివరిలో ఏడీపీని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎంచుకోవడానికి కుదరట. ఎందుకంటే మొదటి సెమిస్టర్ తర్వాత ఏడీపీలో చేరితే రెండో సెమిస్టర్ నుంచి ఈ షరతు అమలు అవుతుంది. మీరు ఏ సెమిస్టర్‌లో తీసుకుంటే ఆ తర్వాత సెమిస్టర్‌కి అవుతుంది. ఇలా మీరు డిగ్రీ కోర్సును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్
ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు 80 మార్కులకు ఉన్న పరీక్ష పేపర్‌ను ఇకపై 100 మార్కులకే ఉండనుందని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-2025 నుంచి 100 మార్కులకే పరీక్ష పేపర్ ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్