ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ప్రక్రియ గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. 5వ తేదీ నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేశారు.
ఇది కూడా చూడండి: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకించేందుకు రెడీ అయిన ట్రంప్..
గతంలో కంటే ఈసారి ఫీజు తక్కువగా..
ఈ సారి టెట్ ఫీజును తగ్గిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెప్పినట్లుగానే ఈసారి టెట్ పరీక్ష ఫీజును తగ్గించారు. గతంలో ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000 ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.750, రూ.1000కి తగ్గించారు. అయితే ఈ ఏడాది మే నెలలో టెట్ రాసి కూడా అర్హత సాధించని వాళ్లు మళ్లీ స్కోర్ పెంచుకోవడానికి పరీక్ష రాసే వాళ్లకి ఎలాంటి ఫీజు ఉండదు.
ఇది కూడా చూడండి: Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..
2025 జనవరి 1 నుంచి 20వ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా 2024 మే 20వ నుంచి జూన్ 2 వరకు పరీక్షలు నిర్వహించింది. అయితే రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించగా.. ఇచ్చిన మాట ప్రకారమే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇది కూడా చూడండి: Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్
టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇక స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని నిర్ణయించగా.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ రాయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆరుసార్లు పరీక్షలు నిర్వహించగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటంపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా