Google: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. గూగుల్ గ్రీన్ సిగ్నల్.. త్వరలో 25 వేల ఉద్యోగాలు!

ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ.50 వేల పెట్టుబడితో గూగుల్ పెడుతున్న ఈ డేటా సెంటర్ ద్వారా దాదాపుగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

New Update
google layoffs 2025

google

ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖపట్నంలోని మధురవాడలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం గూగుల్ సుమారుగా రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌గా నిలవనుంది. అమెరికా దేశంలో కాకుండా వేరే దేశంలో గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రాలలో ఇది ఒకటి కావడం విశేషం.

ఇది కూడా చూడండి: JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్!

ప్రపంచ డిజిటల్ హబ్‌గా..

ఈ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇన్వెస్ట్ ఇండియా' సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గూగుల్ ప్రతిపాదన ఒక గేమ్‌ ఛేంజర్ కానుందని.. ఇది దేశానికి ప్రపంచ డిజిటల్ హబ్‌గా గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం డిజిటల్ రంగంలో ఒక ప్రముఖ కేంద్రంగా మారనుంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సేవలకు ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా గూగుల్ అందించే ఏఐ సేవలు ఇకపై మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయి.

దాదాపుగా 25 వేల మందికి ఉపాధి..

దేశంలో డేటా సెంటర్ వల్ల మన డేటా అంతా ఇక్కడే నిల్వ ఉంటుంది. దీంతో డేటా లీక్ అయ్యే అవకాశం ఉండదు. డేటా అంతా భద్రంగా ఉంటుంది. అంతర్జాతీయ బ్యాండ్ విడ్త్‌ను పెంచేందుకు మూడు సబ్‌ మెరైన్ కేబుల్స్‌కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి.  అయితే ముంబైలో గూగుల్‌కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి. ఈ కేబుల్స్‌ను సముద్ర మార్గం ద్వారా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ డేటా సెంటర్ కూలింగ్ కోసం ఎక్కువగా వాటర్ కావాలి. అందుకే బీచ్ ఉన్న విశాఖను గూగుల్ ఎంచుకుంది. రూ.50 వేల పెట్టుబడితో గూగుల్ పెడుతున్న ఈ డేటా సెంటర్ ద్వారా దాదాపుగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరోక్షంగా ఇంకో 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: Retail Stores: రిటైల్ స్టోర్లలో మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారా ? ఇకనుంచి అలా చెల్లదు !

Advertisment
తాజా కథనాలు