/rtv/media/media_files/2025/01/24/NpvguhTxRLoODGUnkuK1.jpg)
RRB Ministerial and Isolated Post Recruitment 2025
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 32వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మరొక ప్రకటన వదిలింది. 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.
పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో దరఖాస్తు ప్రక్రియ ముగియడానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
మొత్తం ఖాళీల సంఖ్య - 1036
పోస్టుల వారీగా:
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338 పోస్టులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: 187 పోస్టులు
లైబ్రేరియన్: 188 పోస్టులు
చీఫ్ లా అసిస్టెంట్: 54 పోస్టులు
జూనియర్ ట్రాన్స్‌లేటర్: 130 పోస్టులు
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్: 59 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20 పోస్టులు
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 18 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3: 12 పోస్టులు
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మ్యూజిక్ టీచర్: 10 పోస్టులు
సైంటిఫిక్ సూపర్‌వైజర్: 03 పోస్టులు
సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్: 03 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్: 02 పోస్టులు
ప్రైమరీ రైల్వే టీచర్: 03 పోస్టులు
అసిస్టెంట్ టీచర్: 02 పోస్టులు
ల్యాబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్: 07 పోస్టులు
విద్యార్హత:
పోస్టును బట్టి డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, టెట్, బీటెక్, ఎంబీఏ, బీఎడ్, బీఈ, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్
దరఖాస్తు విధానం:
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం తేదీ: 07.01.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2025.