నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5,647 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో రైల్వేలో 5,647 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  2024 నవంబర్ 4నుంచి డిసెంబర్ 3వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. www.nfr.indianrailways.gov.in

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

RRC:  రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్ఆర్ సీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో 5,647 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు అస్సాంలోని గువాహటి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే(NFR) ఖాళీలను భర్తీ చేయనుండగా.. ఉద్యోగాలకు ఎంపికైన ఆరు కతిహార్, తింధారియా, రంగియా, దిబ్రుగర్, మాలిగావ్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 
ఇక ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nfr.indianrailways.gov.in. ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాలని సూచించింది.  

Also Read: మాజీ సీఎం జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్!

మొత్తం ఖాళీలు:


యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలు: 5,647

విద్యార్హత:
పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ,12వ తరగతి, MLT ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు:
15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ:
పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 4న ప్రారంభమవగా.. 2024 డిసెంబర్ 3 చివరి తేదీ. 

దరఖాస్తు ఫీజు :
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ,మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:
మెట్రిక్యూలేషన్, ఐటీఐ మార్క్స్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 

Also Read: ఇసుక కోసం వెళ్లారు... ఇంతలోనే విషాదం

Also Read: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు