NEET: నీట్ UG పరీక్షపై NTA సంచలన నిర్ణయం!

నీట్ UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగబోయే ఎగ్జామ్స్ పెన్&పేపర్ (OMR) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో కండక్ట్ చేస్తామని తెలిపింది.

New Update
NEET: ఈనెల 23న వారికి మళ్ళీ నీట్ పరీక్ష..జూన్ 30న ఫలితాలు

NEET UG: నీట్ UG పరీక్ష నిర్వహణపై NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగబోయే ఎగ్జామ్స్ పెన్&పేపర్ (OMR) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో కండక్ట్ చేస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్ పరీక్షను NTA నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.  కాగా 2024లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వార్తలు రావడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

2024లో ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు..

 నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.  2025కి సంబంధించి NEET-UG మెడికల్ ప్రవేశ పరీక్షను పెన్-అండ్-పేపర్ మోడ్‌లో నిర్వహించాలా లేక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)లో నిర్వహించాలా అనేది ఇంకా నిర్ణయించలేదని విద్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు గత నెలలో చెప్పిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఇన్నా..? మొదటి భార్యకు భరణమెంత ఇచ్చాడంటే..

'NEETను పెన్-అండ్-పేపర్ మోడ్‌లో నిర్వహించాలా లేదా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించాలా అని నిర్ణయించడానికి మేము చర్చలు జరుపుతున్నాం. జేపీ నడ్డా నేతృత్వంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చించాం. పరీక్ష నిర్వహణకు ఏ ఎంపిక ఉత్తమమని భావించినా దానిని అమలు చేయడానికి NTA సిద్ధంగా ఉంది'అని ప్రధాన్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు పరీక్షను యథావిధిగా పెన,మరియు పేపర్ ఫార్మాట్‌లో కొనసాగించాలని డిసైడ్ చేశారు.  

ఇది కూడా చదవండి: KTR: ముగిసిన ఈడీ విచారణ.. 7 గంటలు చెమటలు పట్టించిన అధికారులు!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు