విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే స్కాలర్‌షిప్

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ పేరుతో స్కాలర్‌షిప్ అందించనుంది. పది, ఇంటర్, డిప్లొమో చదివిన తర్వాత బీటెక్, మెడిసిన్ ఏ విభాగం వారికైనా నగదు ఇవ్వనుంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 22 చివరి తేదీ.

New Update
LIC

 

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం అదిరిపోయే స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 పేరుతో తీసుకొచ్చిన స్కాలర్‌షిప్ ద్వారా టాలెంట్ ఉన్న విద్యార్థులకు నగదు అందించనుంది. 2021-22, 2022-20, 2023-24 విద్యా సంవత్సరాల్లో చదివిన పది, ఇంటర్మీడియట్, డిప్లొమో విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ఏ విభాగంలో అయిన..

గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌కి అర్హత సాధించాలంటే గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి 60 శాతం మార్కులు ఉండాలి. ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, మెడిసిన్ ఇలా ఏ విభాగంలో అయిన చదవాలనుకున్న విద్యార్థులకు ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్‌ను అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవాలంటే www.licindia.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థినులకు రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. 

ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌‌కి నేటి నుంచే అప్లై చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇచ్చిన మీ వివరాలు అన్ని నమోదు చేసి అప్లై చేసుకోవాలి. దీనికి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 22 చివరి తేదీ. అయితే ఏ విభాగానికి ఏడాదికి ఎంత స్కాలర్‌షిప్ వస్తుందని ఇంకా పూర్తిగా తెలియదు. ఆసక్తి, అర్హత ఉన్నవారు వెంటనే ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోండి. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు