Vikasit Bharat Rozgar Yojana scheme: మోదీ గుడ్‌న్యూస్.. ప్రైవేట్ జాబ్ వస్తే పండగే.. రూ.15వేలు ఇవ్వనున్న కేంద్రం

దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద కొత్త పథకం అమలు చేయనున్నామని మోదీ చెప్పారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరేవారికి ప్రభుత్వం తరఫున రూ.15వేలు ఇవ్వనున్నారు.

New Update
Modi

Modi

దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద కొత్త పథకం అమలు చేయనున్నామని మోదీ చెప్పారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.15వేలు అందించనున్నట్లు చెప్పారు.

ఈ పథకం ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడం, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారిని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన రూ. 99,446 కోట్ల బడ్జెట్‌తో రెండు సంవత్సరాల పాటు (2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు) అమలులో ఉంటుంది. ఈ సమయంలో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంది.

ఉద్యోగులకు ప్రోత్సాహం

ఆర్థిక సహాయం: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మొదటిసారిగా నమోదు చేసుకున్న ఉద్యోగులకు రూ. 15,000 వరకు నగదు ప్రోత్సాహం లభిస్తుంది.

అర్హతలు: నెలకు రూ. 1 లక్ష వరకు జీతం ఉన్న కొత్త ఉద్యోగులు దీనికి అర్హులు.

చెల్లింపు విధానం: ఈ ప్రోత్సాహకాన్ని రెండు విడతల్లో చెల్లిస్తారు. మొదటి విడత ఆరు నెలల సేవ తర్వాత, రెండో విడత ఏడాది తర్వాత ఆర్థిక అక్షరాస్యత కోర్సును పూర్తి చేసుకున్న వారికి లభిస్తుంది. పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఉంచుతారు.

యజమానులకు ప్రోత్సాహం

ఆర్థిక సహాయం: కొత్త ఉద్యోగులను నియమించే సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ. 3,000 వరకు యజమానులకు చెల్లిస్తారు.

లక్ష్యం: ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడమే ఈ భాగం యొక్క ముఖ్య లక్ష్యం. తయారీ రంగంలోని సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు నాలుగేళ్ల వరకు అందుతాయి, ఇతర రంగాల సంస్థలకు రెండేళ్ల వరకు లభిస్తాయి.

అర్హతలు: EPFOలో నమోదు చేసుకున్న సంస్థలు, కనీసం ఆరు నెలల పాటు అదనపు ఉద్యోగులను (50 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని) నియమించుకోవాల్సి ఉంటుంది.

ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థికంగా భద్రత లభించడమే కాకుండా, కంపెనీలు కూడా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహించబడతాయి. దీనివల్ల దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు