JEE మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.

New Update
Jee mains 2026

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల పరీక్ష నిర్వహిస్తారు. 

సెషన్-1 జనవరి: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జరగనున్నాయి. ఈ సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ అక్టోబర్ నెల నుంచే ప్రారంభమవుతుందని ఎన్టీఏ తెలిపింది. కచ్చితమైన తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

సెషన్-2 ఏప్రిల్‌: రెండో సెషన్ పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి 10 తేదీల మధ్య నిర్వహించబడతాయి. సెషన్-2 పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి చివరి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండు సెషన్లకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తమ ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం), చిరునామా వంటి వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే, కేటగిరీ సర్టిఫికెట్ (EWS/OBC-NCL/SC/ST), దివ్యాంగులు (PwD) అయితే UDID కార్డు వంటి ధ్రువపత్రాలు చెల్లుబాటు అయ్యే విధంగా సిద్ధం చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని ఎన్టీఏ యోచిస్తున్నట్లు కూడా తెలిపింది. పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను తరచుగా సందర్శించాలని సూచించారు. ఇంజినీరింగ్ ఆశావహులు ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు