AP CID Notification: ఇంటర్ పాస్ అయితే చాలు.. నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ.. ఏపీ సీఐడీ బంపర్ ఆఫర్!

AP పోలీస్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (CID) విభాగంలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 28న విడుదలైంది. అర్హులైన మహిళలు, పురుషులు మే 1 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు.

New Update
AP CID Notification

AP CID Notification

AP CID Notification: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌(AP Police) విభాగంలోని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (CID) 2025 సంవత్సరానికి సంబంధించి హోంగార్డు(AP Home Gaurd) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 28 హోంగార్డు పోస్టులకు గాను అర్హత కలిగిన పురుషులు, మహిళల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా ఈ నోటిఫికేషన్ ఏప్రిల్‌ 28న విడుదలైంది, మే 1 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

Also Read: ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, అర్హతల వివరాలివే!

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్‌ అర్హతను కలిగి ఉండాలి. అంతేకాక, కంప్యూటర్‌ స్కిల్స్‌ తప్పనిసరి కాగా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ముఖ్యమైన అర్హతలలో ఒకటి. ప్రత్యేకంగా బీటెక్‌, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ (కంప్యూటర్స్‌) వంటి కోర్సులు చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

Also Read: 10, 12 తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

అర్హతలు:

  • వయస్సు: 2025 మే 1 నాటికి 18 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

  • విద్యార్హత: ఇంటర్మీడియట్‌ పాస్, బీటెక్‌, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్స్‌) వంటి ఐటీ సంబంధిత డిగ్రీలు ఉన్నవారికి ప్రాధాన్యత.

  • భాషా నైపుణ్యం: తెలుగు భాషలో మాట్లాడే, చదవగలిగే నైపుణ్యం అవసరం.

స్కిల్స్‌:

  • కంప్యూటర్‌ పరిజ్ఞానం: బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌ తప్పనిసరి.

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌: లైట్‌ లేదా హెవీ మోటార్‌ వాహనాల డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి.

  • స్థానికత: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

అయితే, పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 160 సెం.మీ. ఉండాలి. మహిళలకు ఈ పరిమితి 150 సెం.మీ. కాగా, ఎస్‌టీ(ST) మహిళలకు అదనంగా 5 సెం.మీ. ఎత్తు సడలింపు ఉంటుంది. అభ్యర్థుల వయసు 2025 మే 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 50 సంవత్సరాల లోపు ఉండాలి.

భౌతిక ప్రమాణాలు:

  • పురుషులు: ఎత్తు కనీసం 160 సెం.మీ.

  • మహిళలు: ఎత్తు కనీసం 150 సెం.మీ.

  • ఎస్‌టీ(ST) మహిళలకు: 5 సెం.మీ. ఎత్తు సడలింపు.

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, సీఐడీ, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, మంగళగిరి – 522503 చిరునామాకు నేరుగా లేదా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపించవచ్చు.

దరఖాస్తు విధానం:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 1

  • దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 15

  • దరఖాస్తు సమర్పణ: అభ్యర్థులు నేరుగా లేదా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా క్రింది చిరునామాకు దరఖాస్తులు పంపవచ్చు

Also Read: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో మొదటగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. అనంతరం అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్‌ స్కిల్స్‌, టైపింగ్‌, డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. వీటన్నింటిని బట్టి అభ్యర్థులను తుది ఎంపికకు సెలెక్ట్ చేస్తారు. 

ఈ హోంగార్డు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710 చొప్పున డ్యూటీ అలవెన్స్‌ చెల్లించనున్నారు. దరఖాస్తు సంబంధిత పూర్తి వివరాలను, అప్లికేషన్‌ ఫారమ్‌ను https://cid.appolice.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఏవైనా సందేహాలున్నా, అభ్యర్థులు కార్యాలయ పనివేళల్లో 94407 00860 నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు