BSFలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి ఉంటే చాలు

బీఎస్‌ఎఫ్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2024ను ప్రకటించింది. క్రీడా ప్రతిభ ఉన్న పురుష, మహిళా క్రీడాకారులకు ఉత్తమ అవకాశాన్ని అందిస్తోంది. దీని ద్వారా 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ -సీ పోస్టులను భర్తీ చేస్తోంది. డిసెంబర్ 30లో దరఖాస్తు చేసుకోవాలి.

New Update
BSF Constable Recruitment

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సరిహద్దు భద్రతా దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటాలో భారీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ -సీ పోస్టులను భర్తీ చేయనుంది.

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ఇది క్రీడా నైపుణ్యాలను చాటుకున్న పురుష, మహిళా క్రీడాకారులకు ఉత్తమ అవకాశాన్ని అందిస్తోంది. ఎప్పటి నుంచో ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ నియామకంలో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడతారు. అయితే ఇది భవిష్యత్తులో శాశ్వతమయ్యే అవకాశం ఉంటుంది.

క్రీడాంశాలు

ఇది కూడా చదవండి: పాలన ప్రజా విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం!

అథ్లెటిక్స్, సైక్లింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, క్రాస్ కంట్రీ, బ్యాడ్మింటన్, డైవింగ్, బాస్కెట్‌‌బాల్, వాలీబాల్, వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌, హాకీ, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌‌బాల్, వాటర్‌‌ స్పోర్ట్స్, హ్యాండ్‌‌బాల్,  టైక్వాండో, వాటర్ పోలో, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, షూటింగ్, వుషు, ఫెన్సింగ్

విద్యార్హత

ఆసక్తి కలిగిన అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీనితో పాటు నేషనల్ / ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్నొని ఉండాలి. లేదా విజయాలు సాధించి ఉండాలి. 

ఇది కూడా చదవండి: దారుణం.. సహజీవనం చేయలేదని ఏం చేశాడంటే?

వయస్సు

అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం

ఇది కూడా చదవండి: ఏపీ విద్యార్థులకు గోల్డెన్‌ న్యూస్‌..ఉచితంగా రూ. 50 వేల వరకు..!

అప్లికేషన్స్‌‌ షార్ట్‌‌లిస్టింగ్‌‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు

ఆన్​లైన్​‌ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 2024 డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు www.bsf.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ముందుగా ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

తర్వాత అదర్ లింక్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి రిక్రూట్‌మెంట్ పై క్లిక్ చేయాలి. 

అనంతరం అప్లై చేసుకోవాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు