Ap: ఏపీ విద్యార్థులకు గోల్డెన్‌ న్యూస్‌..ఉచితంగా రూ. 50 వేల వరకు..!

ఏపీలోని కోనసీమ జిల్లాలో తొలిసారి సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు బీమా పథకం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం రూ.200కే రూ.50వేల వరకు బీమాను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.

New Update
collector

Ap: డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ మహేష్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారి సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు విద్యార్థులకు ‘గోల్డెన్‌ అవర్‌ బీమా’ను కోనసీమ జిల్లాలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు బీమా పథకంపై బ్యాంకర్లు, జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టారు.

Also Read: నల్గొండకు సీఎం రేవంత్.. చిరకాల స్వప్నం నెరవేరిందంటూ వెంకట్ రెడ్డి ఎమోషనల్!

విద్యార్థులు చిన్నచిన్న అనారోగ్యాలు, దెబ్బలు తగిలినప్పుడు ఆలస్యం చేస్తే అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయని చెప్పారు. విద్యార్థులకు గోల్డెన్‌ అవర్‌లో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ బీమా పథకాన్ని అమలుచేయాలనుకుంటున్నట్లు, ఈ నిర్ణయంతో డ్రాపౌట్స్‌ తగ్గే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నెల 15 తర్వాత బీమాను అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Also Read: Ajith Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు బిగ్ రిలీఫ్..

సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఖర్చు సంక్షేమ అధికారులపై పడనుంది. దీంతో వారు వెనకాడాల్సిన పరిస్థితి.. అందుకే కలెక్టర్‌ వినూత్నంగా ఆలోచన చేపట్టారు. బీమా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ముంబైలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం అధికారులతో చర్చలు జరిపారు. తన ఆలోచనను వారికి వివరించారు. 

Also Read: నైజాంలో 'పుష్ప2' ఆల్ టైమ్ రికార్డ్.. ఆ హీరోలను తొక్కిపడేసిన బన్నీ

ఈ మేరకు ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50,000 వరకు బీమా సదుపాయం కల్పించేలా వారిని ఒప్పించారు. అంతేకాదు ప్రీమియం డబ్బులు కూడా విద్యార్థి, ప్రభుత్వం పై భారం పడకుండా చేశారు. ఈ మేరకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వేదాంత సంస్థ నుంచి నిధులు సమకూరేలా ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read: నందమూరి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ మూవీ వాయిదా..?

ఈ బీమాకు సంబంధించి ఏడాదికి గరిష్ఠంగా రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో 94 వసతిగృహాల్లో మొత్తం 8,384 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. వీరందరికీ ఈ బీమా అందనుంది. విద్యార్థులకు జ్వరాలు, ఆటల్లో దెబ్బలు, కుక్క, పాము, తేలు కాట్లు, యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, టాన్సిల్స్, చర్మ సంబంధ సమస్యలు ఇలా 20 రకాల వ్యాధులను బీమాలో చేర్చినట్లు అధికారులు చెప్పారు.

మొత్తానికి విద్యార్థులకు ఈ బీమాతో ప్రయోజనం కలగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వచ్చిన ఈ ఆలోచనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు