Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్

జియో తన టెలికాం, మొబైల్ ఛార్జీలను వరుసగా సవరిస్తోంది. రీసెంట్‌గా టెలికాం ఛార్జీలను సవరించిన జియో ఇప్పుడు 5జీ డేటా బూస్టర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఏ ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉన్నవారైనా ఈ బూస్టర్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చును.

New Update
Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్

Jio New Plan: జియోలో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్ వచ్చేసింది. జియోలో ఇప్పటివరకు చాలా రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటి మీద ఈ బూస్టర్ పలాన్‌ను ఉపయోగించుకోవచ్చును. ఏ ప్రీపెయిడ్ ప‌లాన్ అయినా ఈ అదను రీఛర్జ్ ఉపయోగించుకుని తన డేటాను పెంచుకోవచ్చును. ఈ కొత్త ప్లాన్ల ధర రూ.51, రూ. 101, రూ. 151 లుగా ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్‌లు ఉత్తమమైనవి.

కొత్తగా ప్రవేశ పెట్టిన ప్లాన్‌లు అన్నీ అపరమిత డేటాతో వస్తాయి. ఈ మూడు ప్లాన్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ లేదు. ఈ ప్లాన్‌ల చెల్లుబాటు మాత్రం యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది. జియో వెబ్‌సైట్‌లో ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ సెక్షన్ కింద ఈ ప్లాన్‌లు లిస్ట్‌ అయ్యాయి. అయితే ఇవి రూ. 479, రూ. 1,899 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు అనుకూలంగా లేవు. ప్రీపెయిడ్ ప్లాన్లు మూడింటిలో చౌకైన రూ. 51 ప్లాన్కు ఇది బాగా అనుకూలంగా ఉంది. దానికి ఈ కొత్త ప్లాన్ 3జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తుంది. ఎవరైనా 5జీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, అపరిమిత 5జీతో పాటుగా రూ.101 ప్లాన్‌ అయితే 6జీబీ 4జీ డేటా, రూ.151 ప్లాన్‌ అయితే 9జీబీ 4జీ డేటా పొందవచ్చు.

Also Read:Andhra Pradesh: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు