ఝూర్ఖండ్‌లో కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రే అరెస్టు కావడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం అనంతరం ఈరోజు ( శుక్రవారం) ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ పార్టీల ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించారు. మరో రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు.
Also Read: ఇంకెప్పుడు రేవంత్.. ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ఫైర్
అప్పటివరకు హైదరాబాద్‌లోనే
ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ రాజకీయం హైదరాబాద్‌కు షిప్ట్ కావడం చర్చనీయమవుతోంది. రాంచి బిర్సా ముండా విమానశ్రయం నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వాళ్లని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి లియోనియా రిసార్ట్స్‌కు తరలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఇక ఝూర్ఖండ్‌లో బలపరీక్ష తేదీ ఖరారయ్యే దాకా హైదరాబాద్ క్యాంపులోనే ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఇక ఆపరేషన్ ఝార్ఖండ్ బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు.
హేమంత్ సొరెన్‌కు ఎదురుదెబ్బ
ఇదిలాఉండగా.. రాష్ట్ర మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బుధవారం అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో హాజరుపరిచారు. విచారణ కోసం 10 రోజుల పాటు హేమంత్‌ను కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపే కోర్టు తమ తీర్పను శుక్రవారానికి రిజర్వ్ చేయడంతో పాటు ఒకరోజు పాటు జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని చెప్పింది.
Also Read: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం..హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు