Jharkhand: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష..

రేపు ఝార్ఖండ్‌ అసెంబ్లీలో ఫ్లోర్‌ టెస్ట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 40 మంది ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలు రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. జేఎంఎం పార్టీ అధికారంలో ఉండాలంటే 41 మంది ఎమ్మెల్యేలను మెజార్టీగా చూపించుకోవాల్సి ఉంటుంది.

Jharkhand: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష..
New Update

ఇటీవల అవినీతి ఆరోపణల కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టుకు ముందు తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా భాధ్యతలకు చేపట్టారు. మరో పది రోజుల్లో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

మెజార్టీ సంఖ్య 41

అయితే సోమవారం ఝూర్ఖండ్‌ అసెంబ్లీలో ఫ్లోర్‌ టెస్ట్‌ (బల పరీక్ష) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలందరూ రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే 81 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41కి చేరింది. జేఎంఎం పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉంది. ఆ పార్టీలో ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌)కు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు.

అప్పుడే అనుకున్నారు 

మరోవైపు విపక్ష బీజేపీకి 25 మందితో పాటు దాని మిత్ర పక్షాలతో కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని పరిణామాలు జరిగితే తప్ప అధికార జేఎంఎం బలపరీక్షలో సులువుగానే గెలిచే అవకాశముంది. ఇదిలాఉండగా.. 2022 సెప్టెంబర్‌లో కూడా మాజీ సీఎం హేమంత్ సోరెన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సమయంలో ఆయనపై అనర్హత వేటు పడొచ్చని అందరూ అనుకున్నారు.

గతంలో కూడా ఫ్లోర్‌టెస్ట్ 

ఇక చివరికి జేఎంఎం ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి 48 ఓట్ల మెజారిటీతో బరపరీక్షలో విజయం సాధించింది. అయితే మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. హేమంత్‌ సోరెన్ అరెస్టు కావడం.. చంపై సోరెన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, మళ్లీ ఇప్పుడు ఫ్లోర్‌ టెస్ట్‌ ఎదుర్కోవడం వంటివి ఝార్ఖండ్‌ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

#floor-test #jharkhand #bjp #jmm #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి