Movies: దేవరలో జాన్వీ క్యూట్ లుక్..బర్త్‌డే గిఫ్ట్

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో జాన్వీకి ఇదే మొట్టమొదటి సినిమా. ఈరోజు ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా జాన్వీ క్యూట్ లుక్స్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్.

Movies: దేవరలో జాన్వీ క్యూట్ లుక్..బర్త్‌డే గిఫ్ట్
New Update

ఆర్ఆర్ఆర్ తరువాత జూ.ఎన్టీయార్ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ముందు నుంచే ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత అవి మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అసలైతే దేవర సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శకుడు. కానీ విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తిగా కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు దసరాకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఇక ఈసినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతోంది. ఇదివరకే ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన నేచురల్ అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వి దేవరలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తంగం పాత్ర మరో పోస్ట్ర్‌ను విడుదల చేశారు. ఇందులో కూడా తెలుగు అమ్మాయిలా అందంగా కనిపిస్తున్న జాన్వీ తన నవ్వుతో కట్టిపడేస్తోంది. అందమైన కురులతో చక్కనైన బొట్టుతో.. చీరలో జాన్వీ చాలా అట్రాక్టివ్ గా ఉంది.

జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులో దేవరతో పాటూ రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటూ బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్టులు కూడా చేస్తోంది.

Also Read:Bengaluru: గంటకు రూ.1000 పార్కింగ్ ఫీజు..ఎక్కడో తెలుసా

#telugu #new-look #jhanvi-kapoor #movies #devara
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe