JEE Main 2024: జేఈఈ పరీక్షకు ప్రతి ఏడాది దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరౌతుంటారు. 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్(JEE Main), జేఈఈ అడ్వాన్సుడ్(JEE Advanced).. ఈ రెండు పరీక్షలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. 2024 సంవత్సరానికి సంబంధించి NTA ఇప్పటివరకు క్యాలెండర్ విడుదల చేయలేదు. దీనిపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఈ పరీక్ష క్యాలెండర్ మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కానుందని సమాచారం. జేఈఈ మెయిన్ పరీక్ష ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
జేఈఈ పరీక్ష ఎందుకు?
జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల్లో 43 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్‌ను పొందారు. తెలంగాణకు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య అత్యధికంగా 100 పర్సంటైల్ స్కోర్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కాళ్లకూరి సాయినాధ్ శ్రీమంత్, ఇషాన్ ఖండేల్వాల్, దేశాంక్ ప్రతాప్ సింగ్, నిపున్ గోయెల్ కూడా 100 పర్సంటైల్ సాధించారు.
మిగిలిన పరీక్షల తేదీల సంగతేంటి?
NTA(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) జేఈఈతో పాటు మిగిలిన పరీక్షల గురించి కూడా మరికొద్ది రోజుల్లోనే డేట్‌లను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రిలీజ్ కానున్న ఎగ్జామ్ క్యాలెండర్‌లో CUET 2024, NEET UGతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల చేయనుంది. ఈ సంవత్సరం, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) మే 7న జరిగింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, లేదా CUET 2023, మే 21 నుంచి మే 31 వరకు, జూన్ 1 నుంచి జూన్ 7 వరకు జరిగాయి.
విద్యార్థులకు నోట్:
జేఈఈ మెయిన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే.. విద్యార్థులు అప్లికేషన్ ఫారమ్‌ను పూరించడానికి లైన్ క్లియర్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ, అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్‌లు ఫిల్ చేయకూడదు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను నింపిన అభ్యర్థులపై కఠిన చర్యలు తప్పవు!
Also Read: 10,391 ఖాళీలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి..శాలరీ రూ.56,900!