JEE: విద్యార్థులకు అలెర్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్స్-2024 పరీక్షతో పాటు CUET 2024, NEET UG ఎగ్జామ్స్‌కి సంబంధించి తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలోనే విడుదల చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ప్రతిఏడాది దాదాపు 13లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు.