Big breaking: మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్‌పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టలను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Big breaking: మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్‌పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 జిలిటిన్‌ స్టిక్స్, 3 డిటోనేటర్‌లు, 5 మొబైల్ ఫోన్స్, 3 బైక్‌లు, రూ.21 630 నగదుతో పాటు మావోయిస్టు సాహిత్య గ్రంథాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

వారోత్సవాల నేపథ్యంలో...

జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లాకు చెందిన వారని మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సంయుక్త కార్యదర్శి ఏగోలపు మల్లయ్య ఆదేశాల మేరకు.. మావోయిస్టు అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కరావును కలిసి మావోయిస్టు పార్టీ కొరకు, క్యాడర్‌ను ఏర్పాటు చేస్తామని అతడు తెలిపినట్లు విచారణలో తెలిందని ఎస్పీ పేర్కొన్నారు. దీనిలో భాగంగా వారు ఇచ్చిన సాహిత్య రచనలను ఊరులో వేయడానికి ఇచ్చిన కరపత్రాలను 3 జిలితిన్ స్టిక్స్, 3 డిటోనేటర్లు తీసుకువస్తుండగా మార్గమధ్యలో వారిని అదుపులోకి తీసుకోని విచారణ చేశామని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా వాహనాల తనిఖీతో పాటు.. ప్రజలతో మమేకమై శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఎవరైన నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులకు సహాకారం అందించినా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

చింతగుప్ప అటవీ ప్రాంతంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీపీఐఎంఎల్ ప్రజాపంథా పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులను కలిసి తిరిగి వస్తుండగా సరిహద్దు చత్తీస్‌ఘడ్ సుక్మా జిల్లా చింతగుప్ప అటవీ ప్రాంతంలో చరణ్‌ పోలీసుకు చిక్కాడు.  మావోయిస్టు పార్టీకి చెందిన బ్యానర్లు, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చరణ్‌పై అక్రమ కేసు, అరెస్ట్‌ను నిరసిస్తున్నామని సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకులు ఆరోపించారు.

సౌకర్యాలు కల్పించాలని డిమాండ్

గొత్తికోయల సమస్యలపై రేపు భద్రాచలంలో సీపీఐఎంఎల్ ప్రజాపంథా ప్రదర్శన తలపెట్టింది. వారిని పౌరులుగా గుర్తించాలని, పోడు హక్కులతో పాటు.. అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.  పోలీసులు ఈ అక్రమ కేసు, అరెస్ట్‌ను సీపీఐఎంఎల్ ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పీఐఎంఎల్ ప్రజాపంథా నాయకుడు, డివిజన్ కార్యదర్శిపై కేసు మోపడం భద్రాద్రి పోలీసుల అక్రమ వ్యవహారాలకు నిదర్శనం అన్నారు. డివిజన్ కార్యదర్శిని ఇలా చేస్తే... ఇక సామాన్యుల పరిస్థితి ఎంటో..?  అర్దం అవుతుందన్నారు. అయితే చరణ్ ఇటీవల వరద బాధితుల సమస్యలపై.. చర్ల మండలం సమస్యలపై, ఇసుక మాఫియాపై పోరాటాలు జరిపారు. ఆ కక్ష్యతోనే  పోలీసులు  అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు.  దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజాపంథా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు