అందుకే అమ్మను షూటింగ్‌ లొకేషన్‌కు రానివ్వలేదు.. జాన్వీ కపూర్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ తన తల్లి శ్రీదేవిని షూటింగ్ లొకేషన్ కు రానివ్వకపోవడంపై ఓపెన్ అయింది. వారసత్వానికి సంబంధించి ఆనవాళ్లు ఉండకుండా నేను సొంతంగా ఎదగాలనుకున్నాను. అమ్మ వస్తే అభద్రతాభావం ఉండేది. కానీ ఇప్పుడు అది తప్పు అని తెలుసుకుని బాధపడుతున్నట్లు తెలిపింది.

అందుకే అమ్మను షూటింగ్‌ లొకేషన్‌కు రానివ్వలేదు.. జాన్వీ కపూర్
New Update

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీకపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని తలచుకుంటూ మరోసారి ఎమోషనల్ అయింది. ఇప్పటికే పలు సందర్భాల్లోనూ తల్లితో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్న జాన్వీ.. తాజాగా నటిగా మారిన తర్వాత అమ్మతో ఎలా ఉండేదో ఓపెన్ అయింది.

publive-image

ఈ మేరకు రీసెంట్ గా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన తొలి చిత్రం ‘ధడక్‌' షూటింగ్‌ సమయంలో లొకేషన్‌కు రావొద్దని కోరినట్లు తెలిపింది. 'మా అమ్మకు ఉన్న పేరుప్రతిష్టల కారణంగానే నాకు అవకాశాలు ఇస్తున్నారని చాలామంది అనుకునేవారు. ఇప్పటికీ కొంతమంది అనుకుంటున్నారు. అందుకే మా అమ్మ బతికి ఉన్నప్పుడు నా సినిమా షూటింగ్‌ లొకేషన్‌కు రావొద్దని చెప్పాను. వారసత్వానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు ఉండకుండా నేను సొంతంగా ఎదగాలనుకున్నాను. ఎందుకంటే వారి సపోర్ట్ ఉంటే నాలో ఏదో తెలియని అభద్రతాభావం ఉండేది. చాలా ఒత్తికి లోనయ్యాను. అమ్మలా నటించాలని, అలాంటి హవభావాలు పలికించాలనే తపనతో కొన్నిసార్లు ఫెయిల్ అయ్యేదాన్ని. అమ్మ ఎలాంటి సలహాలు ఇచ్చిన తీసుకునేదాన్ని కాదు. కొంతకాలం గడిచాక నా నిర్ణయాలు తప్పని తెలుసుకుని చాలా బాధపడ్డాను. ఇప్పుడు అమ్మ ఉంటే షూటింగ్‌కు పిలిచి ఆనందంగా ఎన్నో విషయాలను పంచుకునేదాన్ని. శ్రీదేవి కూతురిగా పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది జాన్వీకపూర్‌.

publive-image

ఇది కూడా చదవండి : Telangana Assembly:”అచ్చోసిన ఆంబోతులు”…కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఇక జూనీయర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీకపూర్‌ తెలుగులో అరంగేట్రం చేయనుంది. ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి. 20245లో విడుదల కాబోతున్న సినిమానుంచి త్వరలోనే మరో బిగ్ అప్ డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

#janhvi-kapoor #bollywood #sridevi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe