Ap Politics : ఏపీలో ఎన్నికలు(Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్ని తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేన(Janasena) , టీడీపీ(TDP) పొత్తులో భాగంగా పార్టీకి 21 సీట్లు ఇవ్వగా.. అందులో జనసేన ఇప్పటికే 6 గురు అభ్యర్థుల నియోజకవర్గాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మరో 9 మందికి జనసేన అధినేత పవన్(Pawan Kalyan) నియామక పత్రాలు అందించారు. ఖరారు చేసిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులిపర్తి రామాంజనేయులు, నర్సాపూరం నుండి బొమ్మిడి నాయకర్, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచలి నుండి సుందరపు విజయ్ కుమార్, రాజోలు దేవ వరప్రసాద్, విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తిరుపతి అరణి శ్రీనివాసుల ను అభ్యర్థులుగా ప్రకటించిన పవన్ కల్యాణ్.
ఇప్పటికే 6మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్...తాజాగా 9 మందికి పచ్చ జెండా ఊపడం తో 15మందిని ఫైనల్ చేసిన పవన్..మిగతా 6 స్థానాలను గురువారం ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో 9 మందికి స్వయంగా నియామక పత్రాలు అందజేశారు.
అభ్యర్థులు నియోజకవర్గంలో కచ్చితంగా గెలిచి తీరాలని చెప్పిన అధినేత
నేటి నుండి నియోజకవర్గం లో ప్రచారం చేసుకోవాలని పవన్ అభ్యర్థులకు తెలిపారు. మొన్న ప్రకటించిన 6మంది అభ్యర్థులతో విడివిడిగా గా మాట్లాడి వారికి సూచనలు చేసిన పవన్ కల్యాణ్.
Also Read : ఐఆర్‌సీటీసీ రిఫండ్స్ ఇక నుంచి మరింత వేగంగా.. గంటలోనే మీ అకౌంట్ లోకి నగదు!