Anakapalle : అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో.. ఏపీ(AP) లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ(YCP) అధిష్ఠానం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభలు పెడుతున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన(TDP-Janasena) కూడా ఎన్నికల సమరంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఈ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ప్రస్తుతం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయి.
నాగబాబు బరిలోకి..!
ఈ నేపథ్యంలో అనాకపల్లి(Anakapalle) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి.. ప్రముఖ సినీ నటడు, జనసేన నేత నాగబాబు(Naga Babu) పోటీ చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఆ సీట్ కోసం టీడీపీలో అంతర్యుద్ధం జరుగుతోంది. టీడీపీ నుంచి ఇప్పటికే బైరా దిలిప్, చింతకాయల విజయ్‌ల మధ్య ఈ సీట్ కోసం ఫైట్ జరుగుతోంది. బైరా దీలిప్ అభ్యర్థిత్వాన్ని అయ్యన్న పాత్రుడు అంగీకరిండం లేదని తెలుస్తోంది. మరోవైపు తాజాగా జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణకు ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు.
Also Read : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ?
పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ?
అయితే అనకాపల్లి పార్లమెంట్ టికెట్ నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ పార్లమెంట్ పరిధిలో నాగబాబు పర్యటనలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేదానిపై ఆయన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఈరోజు నాగబాబు పెందుర్తి, ఎలమంచిలిలో పర్యటించనున్నారు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని ఇటీవల సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ, టీడీపీ-జనసేనల మధ్య గట్టి పోటీ ఉండనుంది. బీజేపీ కూడా టీడీపీ-జనసేనలతో కలవనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మజీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షా(Amit Shah) ను కలిసి పొత్తులు, సీట్ల గురించి చర్చించిన విషయం తెలసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!