/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T193309.498.jpg)
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై.. జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. కోపమొస్తే ఈవీఎంలు పగలగొడతారా అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కోపమొచ్చి పగలగొట్టే దాన్ని సమర్ధిస్తారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు చూసుకుంటారు కదా అంటూ ధ్వజమెత్తారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరీన ఏచ్చులకి పోయినందుకే పదకొండుకే ప్రజలు పరిమితం చేశారని అన్నారు. ఇప్పటికైనా మారకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తారంటూ ఎద్దేవా చేశారు.
Also read: అత్యంత ఖరీదైన నగరాల్లో ‘హైదరాబాద్’ కి ఏ స్థానామో తెలుసా!
జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా?
కోపమొచ్చి E.V.M లు పగలగొట్టార??
ఒకవేళ నిజంగా అన్యాయం జరగుంటే అక్కడ పోలిస్ సిబ్బంది లేరా Election సిబ్బంది లేరా?R.O లేరా??ఇవన్నీ ఆలోచించకుండా కోపమొచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్దిస్తార మీరు??
ఏం మాట్లడుతున్నారండి…
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 4, 2024