ap political: రాబోయే ప్రభుత్వం జనసేన-టీడీపీదే.. జగన్ సర్కార్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్

వారాహి విజయయాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పవన్‌కళ్యాణ్ ఆరోపించారు. రేపటి పెడన సభలో గొడవలు సృష్టించేందుకు ప్రణాళిక చేస్తున్నారని మండిపడ్డారు. వారాహి విజయయాత్రను అడ్డుకోవడమే జగన్ లక్ష్యం మన్నారు. జన సైనికులు, తెలుగుతమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.

New Update
ap political: రాబోయే ప్రభుత్వం జనసేన-టీడీపీదే.. జగన్ సర్కార్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్

మచిలీపట్నం జనవాణి అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీమూకలు, గూండాలు, అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని సీఎం జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా.. దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన జనవాణి - జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నాయకుడికి, డీజీపీకి, హోంమంత్రికి, పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. పెడన సభలో కనుక ఏవైనా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించేది లేదన్నారు. ఏం జరిగినా..? వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

చుట్టుముట్టి పోలీసులకు అప్పగిద్దాం

వచ్చే ఎన్నికల్లో జన సైనికులు, తెలుగు తమ్ముళ్ల కలయికను ఎలాగైనా చెడగొట్టేందుకు వైసీపీ దుష్ట పన్నాగాలు పన్నుతోందంటూ ద్వజమెత్తారు పవన్ కళ్యాణ్. ఇరు పార్టీల మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలని భావిస్తోందని ఆరోపించారు. జనసేన, తెలుగుదేశం పార్టీల కలయికకు విఘాతం కలిగించేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సభలో ఏ మాత్రం రాళ్ల దాడి జరిగినా, గూండాలు చెలరేగినా పోలీసులే వారిని నిలువరించాలన్నారు. పులివెందుల రౌడీయిజం సహించమని స్పష్టం చేశారు. క్రిమినల్ మైండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో గొడవలు సృష్టించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు. వారాహి విజయ యాత్ర సభలో ఎవరైనా అగంతకులు రాళ్ల దాడికి దిగినా.. జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు ఎదురు దాడికి దిగవద్దని కోరారు. రాళ్ల దాడి చేసే వారిని చుట్టుముట్టి పోలీసులకు అప్పగిద్దామన్నారు. అంతా కలిసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్దాం. ఎవరైనా సభలో అనుమానాస్పదంగా కనిపించినా..? వెంటనే వారిని పోలీసులకు అప్పగించండని సూచించారు.

సీఎం, పోలీసులు బాధ్యత వహించాలి

కత్తులు, మరణాయుధాలు తీసుకొచ్చే వారిని చుట్టుముట్టి బంధించండి అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎదురు దాడి చేయకండని సూచించారు. చుట్టుముట్టి బంధించిన వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్దామన్నారు. ప్రతి ఒక్కరినీ చట్టానికి అప్పగిద్దాం. రాబోతున్న జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. బుధవారం జరిగే వారాహి విజయయాత్ర సభలో ఏం జరిగినా..!!  కచ్చితంగా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ, ఇతర పోలీసు అధికారులు దీనికి బాధ్యత వహించాల్సింది ఉందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు