Janasena Chief Pawan Kalyan Hot Comments on YCP government: వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మూడవ విడత వారాహి విజయ యాత్రకు ప్రజలు బ్రాహ్మరథం పట్టారన్నారు. నాకు ఉత్తరాంధ్ర అంటే అపారమైన ప్రేమ ఉందన్నారు. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: ఏపీ క్రైమ్ కి అడ్డాగా మారిపోయింది.. సీఎం పదవికి రెడీగా ఉన్నాను: పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.
Translate this News: