Janhvi Kapoor : తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. ఎప్పుడో చెప్పేసిన 'దేవర' బ్యూటీ!

తిరుమల దేవస్థానంలో జాన్వీ తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోబోతుందని, బంగారు పూతతో ఉండే తన తల్లి చీరను ధరించే పెళ్లి చేసుకుంటుందని వార్తలు ప్రచారం అవ్వగా.. ఈ వార్తలపై జాన్వీ కపూర్ తాజాగా స్పందించింది.

New Update
Janhvi Kapoor : తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. ఎప్పుడో చెప్పేసిన 'దేవర' బ్యూటీ!

Janhvi Kapoor About Her Marriage :  బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినిమాల కంటే ఎఫైర్ వార్తలతోనే సోషల్ మీడియా(Social Media) లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ముఖ్యంగా తన ప్రియుడు శిఖర్ పహారియాతో రిలేషన్ విషయంలో జాన్వీ పై ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. ఇక తాజాగా ఈమె పెళ్లి టాపిక్ అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మెయిన్ మీడియాలోనూ ప్రధానంగా వినిపించగా.. ఎట్టకేలకు జాన్వీ తన పెళ్లి పై వస్తున్న వార్తలపై స్పందించింది.

తిరుపతిలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి

జాన్వీ కపుర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే(Sushilkumar Shinde) మనవడు శిఖర్ పహారియా(Shikhar Pahariya) తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ వీలు దొరికినపుడల్లా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త బయటికి వచ్చింది. తన తల్లి అమితంగా కొలిచే తిరుమల దేవస్థానంలో జాన్వీ తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోబోతుందని, బంగారు పూతతో ఉండే తన తల్లి చీరను ధరించే పెళ్లి చేసుకుంటుందని వార్తలు ప్రచారం అవ్వగా.. ఈ వార్తలపై జాన్వీ కపూర్ తాజాగా స్పందించింది.

Also Read : మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

పెళ్లి పై 'దేవర' బ్యూటీ క్లారిటీ

తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సెటైర్లు వేసింది. నా పెళ్లి గురించి కానీ తొందర లేదు. వీళ్ళు తమకి తోచింది ఏదో రాస్తుంటారు. వీళ్లకు ఎలాంటి వార్తలు రాయాలో, ఎక్కడి నుంచి వాళ్లకు ఎలాంటి సమాచారం లభిస్తుందో అంటూ కామెంట్స్ చేసింది. దీంతో జాన్వీ జాపుర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు