Alia Bhatt : మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. గత నెల 27 న వామికా తన ఇన్ స్టాగ్రామ్ లో రెడ్ కలర్ శారీ ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కనిపించింది. ఇక ఈ వీడియోలో ఆలియా భట్ ఫేస్ ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

New Update
Alia Bhatt : మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

Alia Bhatt DeepFake Video : రీసెంట్ టైమ్స్ లో సినిమా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఎలాంటి సెన్షేషన్ ని క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆ మధ్య రష్మిక మందన (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో ఆయితే సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

ప్రభుత్వం వీటిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్న సరే కొంతమంది ఏమాత్రం మారడం లేదు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read : ‘ఆర్య’ నా జీవితాన్ని మార్చిన సినిమా, ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా.. బన్నీ, సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!

ఆలియా డీప్ ఫేక్ వీడియో వైరల్

ఆలియా భట్ ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియో పేరుతో నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఒరిజినల్ గా బాలీవుడ్ నటి వామికా గబ్బికి సంబంధించిందిగా తెలుస్తోంది. గత నెల 27 న వామికా తన ఇన్ స్టాగ్రామ్ లో రెడ్ కలర్ శారీ ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కనిపించింది.

ఇక ఈ వీడియోలో ఆలియా భట్ ఫేస్ ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదే వీడియోను ఓ నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆలియా భట్ డీప్ ఫేక్ బారిన పడటంతో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

గతంలో కూడా

ఆలియా భట్ ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఓ సారి ఇలాగే జరిగింది. గత ఏడాది నవంబర్ లో ఆలియా భట్ ఫేస్ ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈమెతో పాటూ కత్రినా కైఫ్, నోరా ఫతేహి, కాజోల్, కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ సైతం డీప్ ఫేక్ బారిన పడ్డారు.

View this post on Instagram

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

Advertisment
తాజా కథనాలు