Sanjay Kumar : కాంగ్రెస్ లోకి జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి సంజయ్ ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.

MLA Sanjay: కవిత వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.. సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
New Update

Telangana : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ (BRS) నుంచి కీలక నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఎన్నికల (Elections) తర్వాత సైతం బీఆర్ఎస్ నుంచి ప్రముఖ కీలక నేతలు కాంగ్రెస్ (Congress) వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా జగిత్యాల (Jagtial) ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆరెస్ కు రాజీనామా చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి సంజయ్ ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.

ఇదిలా ఉంటే.. ఇటీవలే దానం నాగేందర్, కడియం శ్రీహరి చేరగా మొన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..!

#revanth-reddy #brs-mla-sanjay-kumar #congress #jagtial
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe