Sanjay Kumar : కాంగ్రెస్ లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్!
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి సంజయ్ ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.