Jagga Reddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. జగ్గారెడ్డి ఎమోషనల్!

ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి స్పందించారు. ఓటమి తనకు గుణపాఠం నేర్పిందని అన్నారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం పని చేస్తానని అన్నారు.

Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి
New Update

Sangareddy Ex MLA Jagga Reddy: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బలవంతుడు.. బలహీనుడు కాక తప్పదని అన్నారు. ఈరోజు ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు పోటీ చేసిన నన్ను మూడు సార్లు ఓటేసి ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 9 ఓటమి తనను బాధించినా.. ఆ ఓట మి ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నారు.

ALSO READ: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

బలవంతుడు ఏదో ఒకరోజు బలహీనుడు కాకతప్పదని పేర్కొన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఐదేళ్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ( Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన జగ్గా రెడ్డి బీఆర్ఎస్ (BRS Party) అభ్యర్థిపై ఓటమి చెందారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఓటమి తరువాత కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఈ పథకం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటిలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన.. గెలిచినా సంగారెడ్డి ప్రజల మధ్యలోనే ఉంటానని.. వారి సమస్యలపై పోరాడుతానని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!

#telangana-news #cm-revanth-reddy #sangareddy #jaggareddy #telangana-assembly-election-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe