హాలీవుడ్ పిలుస్తుందంటున్న జగ్గూ భాయ్! By Bhavana 18 Nov 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi babu) గురించి ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న జగ్గుభాయ్..చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత జగపతి బాబు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. అటు ప్రతి నాయకుని పాత్రలతో పాటు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆయన రాణిస్తున్నారు. ఆయన ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేశారు. ఆయన విలన్ గా చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా అటు హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో కూడా జగ్గూ భాయ్ తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా జగ్గూ భాయ్ హాలీవుడ్ బాట పడుతున్నట్లు తెలుస్తుంది. ఆయన నటనకు ఫిదా అయిన హాలీవుడ్ మేకర్స్ ఆయనను హాలీవుడ్ కి రావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని జగపతి బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో జగ్గూ భాయ్ ఓ ట్వీట్ తో ఫ్యాన్స్ ని సలహా అడిగారు. నన్ను హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు అని పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీంతో ఈ పోస్ట్ ని చూసిన వారంతా కూడా ఏంటీ జగ్గూ భాయ్ హాలీవుడ్ కి ఎంట్రీనా అంటూ సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తి చేస్తున్నారు. మరికొందరు మీరు హాలీవుడ్ కి అర్హులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు హాలీవుడ్ ని కూడా దున్నేసి వచ్చేయండి అంటూ కామెట్లు పెడుతున్నారు. మరికొందరేమో హాలీవుడ్ వాళ్లు మిమ్మల్ని భరించగలరా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే జగపతి బాబు హాలీవుడ్ ఆఫర్ వచ్చిన విషయాన్ని ప్రకటించలేదు. కానీ ఆయన పోస్ట్ మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. Hollywood pilustundhi… Emmantaru? pic.twitter.com/Uzj14nrKXi— Jaggu Bhai (@IamJagguBhai) November 17, 2023 Also read: ఫ్లైట్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్..శంషాబాద్ నుంచి మరో 4 విమానాలు! #hollywood #jagapathi-babu #viral #tweet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి