YS Jagan: ఐదేండ్లు అసెంబ్లీకి దూరంగా జగన్.. ఆ సాకుతో డుమ్మా!

ప్రతిపక్ష హోదా సాకు చూపి జగన్ ఐదేండ్ల పాటు అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ వ్యూహంతోనే ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్‌కు లేఖ రాశాడని, 2014 ఫార్ములానే మళ్లీ వాడుతున్నాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

YS Jagan: ఐదేండ్లు అసెంబ్లీకి దూరంగా జగన్.. ఆ సాకుతో డుమ్మా!
New Update

AP Assembly: ఐదేళ్లపాటు ఏపీ అసెంబ్లీకి దూరంగా ఉండేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా సాకుతో అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు పక్కా వ్యూహంతోనే స్పీకర్‌కు లేఖ రాసినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్న జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అదే సాకుగా చూపి.. ఐదేళ్లు అసెంబ్లీకీ రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నాడని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఐదేళ్లు జనంలోనే ఉండేలా వ్యూహం రచించుకున్నాడంటున్నారు. గతంలోనూ 2014 ఎన్నికల తర్వాత కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, పాత ఫార్ములానే మళ్లీ వాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరి జగన్‌ ప్లాన్‌ వర్క్ ఔట్ అవుతుందా? లేదా అనేది మరికొన్ని రోజల్లో తేలనుంది. పూర్తి సమాచారం కోసం కింది వీడియోను చూడండి.

#ap-assembly #ycp #tdp #jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe