International: తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందే..డీప్‌ఫేక్‌ కేసులో ఇటలీ ప్రధాని

ఇటలీ ప్రధానమంత్రి మెలోని డీప్ ఫేక్ కేసులో తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన ఇద్దరు తండ్రీకొడుకులను ఇటలీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారే తనకు జరిమానా కట్టాల్సిందేనని మెలోనీ అంటున్నారు.

International: తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందే..డీప్‌ఫేక్‌ కేసులో ఇటలీ ప్రధాని
New Update

Italy PM Meloni: డీప్ ఫేక్ వీడియోల విషయంలో గట్టి పట్టుమీద ఉన్నారు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ. తన డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన నిందితులకు బారీగా శిక్ష పడాల్సిందేనని కోరుతున్నారు. ప్రధాని మెలోనీ మీద సృష్టించిన ఈ డీప్ ఫేక్ వీడియోలు అశ్లీల వెబ్‌సైట్లలో ప్రసారం అవ్వడమే కాక బాగా జనాల్లోకి చొచ్చుకుని కూడా పోయాయి. చాలానెలల పాటూ సోసల్ మీడియాల్లో చక్కర్లు కొట్టాయి. మిలియన్ల వ్యూలను సొంతం చేసుకున్నాయి. దీని మీద ప్రధాని మెలోనీ సీరియస్‌గా ఉన్నారు. తన పరువుకు భంగం కలిగించిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

publive-image

మొత్తం డబ్బును విరాళంగా ఇచ్చేస్తా...

ప్రధాని మెలోనీ డీప్ ఫేక్ వీడీయోలు ఇద్దరు తండ్రీ కొడుకులు తయారు చేశారని ఇటలీ పోలీసులు కనుగొన్నారు. వారిద్దరి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో నడుస్తోంది. దీని విచారణలో భాగంగా ప్రదాని మెలోని కూడా కోర్టు హాజరు కావాల్సి ఉంది. జూలై 2న సార్డినియన్ నగరంలోని సస్సారిలోని కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంది. డీప్ ఫేక్ చేసిన ఇద్దరు నిందితుల మీద మెలోనీ దావా వేశారు. అది కనుక నెగ్గితే వారిద్దరూ కలిసి మెలోనీకి లక్సల యూరోలు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. ఈ జరిమానా ద్వారా వచ్చిన మొత్తాన్ని తాను హింసకు గురైన మహిళలకు మద్దతుగా కలెక్ట్ చేస్తున్న నిధికి విరాళంగా ఇచ్చేస్తానని ప్రధాని మెలోనీ చెబుతున్నారు. ప్రధాని తరుఫున గియులియా మారోంగియు అనే న్యాయవాది కేసును వాదిస్తున్నారు.

publive-image

ఆందోళన కలిగిస్తున్న డీప్‌ ఫేక్..

రాను రాను టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సాంకేతికత వల్ల మనిషి జీవనం ఎంతో సులభతరం అవుతోంది. మానవుడు మేథస్సు కూడా రెట్టింపు అవుతోంది. అయితే ఇదే టెక్నాలజీ వల్ల మనిషి జీవితం అస్తవ్యస్తం అవుతున్న సంగతి కూడా తెలిసిందే. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ.. మానవుడు కొత్త కొత్త ప్రమాదాల్లో పడుతున్నాడు. టెక్నాలజీ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ లేనిపోని కష్టాలు ఎదుర్కొంటుకున్నారు.  ఈ మధ్య కాలంలో టెక్నాలజీ వల్ల డీప్‌ ఫేక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మగ , ఆడ తేడా లేకుండా అందరివీ డీప్ ఫేక్ వీడియోలు  చేసేస్తున్నారు కేటుగాళ్ళు. ఇండియాలో రష్మికా మందన్నా, కృతిసనన్, సచిన్ టెండూల్కర్వి కూడా ఉన్నారు. డీప్ ఫేక్ కేసులు కేవలం భారత్‌కే పరిమితం కాదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఫేస్‌బుక్ హెడ్ మార్క్ జుకర్‌బర్గ్ వరకు దీని బారిన పడినవారే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇంక సామాన్యుల గతేంటి అనే సందేమాలు వ్యక్తం అవుతున్నాయి.

డీప్ ఫేక్ అంటే ఏంటి?

డీప్‌ఫేక్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి ఎవరిదైనా ఒక నకిలీ ఫొటోను తయారు చేస్తుంది. ఇందులో ఏదైనా ఫొటో, ఆడియో, లేదా వీడియోను నకిలీగా చూపించడానికి డీప్ లెర్నింగ్ అనే ఏఐని వాడతారు. దీన్నే డీప్ ఫేక్ అని పిలుస్తారు.  వీటిలో చాలావరకు పోర్న్ లేదా అశ్లీలమైనవి ఉంటాయి. 2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి డీప్‌ఫేక్ సాంకేతిక స్థాయి, సామాజిక ప్రభావం చాలా వేగంగా అభివృద్ధి చెందిందని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ డీప్‌ట్రేస్ చెప్పింది. 2019లో డీప్‌ట్రేస్ కంపెనీ ప్రచురించిన నివేదిక ప్రకారం, మొత్తం 14,678 డీప్‌ఫేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వీటిలో 96 శాతం వీడియోల్లో అశ్లీల అంశాలు ఉన్నాయి. అయితే ఇవి ఎప్పటి నుంచో ఉన్నా..గతంలో మార్ఫింగ్ చేస్తే కల్ఇయర్గా తెలిసిపోయేది. కానీ ఇప్పడు ఏఐ టెక్నాలజీ వాడి చేస్తుండడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టడం కష్టం అవుతోంది. దీంతో చాలామంది మహిళలు విక్టిమ్‌లుగా మారుతున్నారు. 

Also Read:Hyderabad : రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో చిక్కిన కీలక నిందితులు

#italy #pm #deep-fake #meloni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe