IT raids:పారిజాత, కెఎల్ఆర్ ఇళ్ళల్లో దొరికిందెంత? కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ వేట ఇవాళ కూడా కొనసాగుతోంది. నిన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి, కేఎల్ఆర్ ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు. ఈరోజు జనారెడ్డి తనయుడు రఘువీర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. By Manogna alamuru 03 Nov 2023 in రాజకీయాలు Uncategorized New Update షేర్ చేయండి కాంగ్రెస్ నేతల ఇళ్ళను జల్లెడపడుతున్నారు ఐటీ అధికారులు. ఇన్నటి నుంచి వరుసపెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న పారిజాత, కేఎల్ఆర్ ఇళ్ళల్లో పోదాలు చేస్తే ఈరోజు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అతని ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.నార్సింగ్‌లోని కేఎల్‌ఆర్ ఇంట్లోనూ ఈరోజు మళ్ళీ ఐటీ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో కీలక పత్రాలను గుర్తించామని ఆఫీసర్లు చెప్పారు. Also Read:నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు..ఎవరెవరు చేసుకోవచ్చంటే.. ఇక మాదాపూర్‌లోని కేఎల్‌ఆర్ హెడ్ క్వార్టర్స్‌లోనూ తనిఖీలు చేశారు. అక్కడి నుంచి కీలక స్టేట్‌మెంట్లను ఐటీ స్వాధీనం చేసుకుంది. ఈరోజు సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చిగురింత పారిజాతను తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బడంగ్‌పేట్‌కు తరలించారు.నవంబర్ 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి అధాయపన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 18 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తోడల్లుడు గిరిధర్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కొన్ని గంటలుగా వారి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. తుక్కుగూడలో కేఎల్ఆర్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలోనూ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ లోని కేఎల్ఆర్ ఫామ్ హౌజ్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. Also Read:ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం #congress #hyderabad #it-raids మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి