ISRO Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే?

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో.

New Update
ISRO Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే?

ISRO URSC Recruitment 2024: 10 పాసయిన వారి దగ్గర నుంచీ...ఇంజనీరింగ్ చదివే నిరుద్యోగుల వరకూ జాబ్స్ ఉన్నాయి అంటూ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం. ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో. అర్హులైన అభ్యర్ధులు ఫిబ్రవరి 10 నుంచి జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చును. ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చును.

ఏఏ జాబ్స్ ఉన్నాయి..అర్హలు ఏంటి?

224 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇస్రో. ఇందులో
సైంటిస్ట్/ ఇంజనీర్ ఎస్సీ - 5
దీనికి అభ్యర్ధులు ME/M.Tech (Engg) లో 60 శాతం ఉత్తీర్ణత ఉండాలి. 18-30 ఏళ్ళ మధ్య వాళ్లు అర్హులు.

టెక్నికల్ అసిస్టెంట్-55
దీనికి ఇంజనీర్ ఎస్సీ లో 60 శాతం మార్కులతో లేదా ఎమ్ఎస్సీ లేదా దానికి సమానమైన డిగ్రీలో ఉత్తీరనత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చును. 18-28 ఏళ్ళ మధ్య వారు అర్హులు.

సైంటిస్ట్ అసిస్టెంట్ - 6
ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లమాలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉండాలి.

సైంటిస్ట్ అసిస్టెంట్ - 6
60 వాతం మార్కులతో బీఎస్సీ పసయి ఉండాలి. వయసు 18-35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

లైబ్రరీ అసిస్టెంట్ - 1
60 వాతం మార్కులతో BLiSc పాసయి..18 నుంచ 35 ఏళ్ళ మధ్య వారు అయి ఉండాలి.

టెక్నీషియన్, డ్రాట్ మెన్ కలిపి -142
దీనికి టెన్త్ లేదా మెట్రిక్ పాసయి ఉంటే చాలు. అయితే దాంతో పాటూ ITI/NTC సంబంధిత ట్రేడ్‌లో అర్హత ఉండాలి. దీనికి 18-35 సం. మధ్య అర్హత గలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చును.

డ్రాట్ మెన్ - SSLC/SSC లేదా దానికి సమానమైన అర్హత ఉన్నవాళ్ళు, 18-35 మధ్య ఏళ్ళు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చును.

ఫైర్ మెన్-ఎ - 3
SSLC/SSC లేదా దానికి సమానమైన అర్హత ఉన్నవాళ్ళు, 18-35 మధ్య ఏళ్ళు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చును.

కుక్ - 4
SSLC/SSC లేదా దానికి సమానమైన అర్హత...ఏదైనా ప్రముఖ హోటల్, క్యాంటీన్‌లో 5 ఏళ్ళు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు 18-35 సం మధ్య ఉండాలి.

లైట్ వెహికల్ డ్రైవర్ ఎ - 6
SSLC/SSC లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత...లైట్ వెహికల్ డ్రైవర్‌గా 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. వయసు 18-35 సం మధ్య ఉండాలి.

హెవీ వెహికల్ డ్రైవర్ ఎ - 2
SSLC/SSC లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత...లైట్ వెహికల్ డ్రైవర్‌గా 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. వయసు 18-35 సం మధ్య ఉండాలి.

మరిన్ని వివరాల కోసం ఇస్రో అధికారిక వెబ్‌ సైట్‌ లో తెలుసుకోవచ్చును. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఫిబ్రవరి 10. చివర తేదీని ఇంకా ప్రకటించలేదు.

Also read:విశాఖలో దారుణం..ఎమ్మార్వో హత్య..అదుపులో అనుమానితులు

Advertisment
Advertisment
తాజా కథనాలు