Aditya L1 : తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1.. త్వరలోనే విన్యాసాలు..

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 ప్రయోగం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్‌. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌకను ఎల్‌1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.

New Update
Aditya L1 : తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1.. త్వరలోనే విన్యాసాలు..

Aditya L1 Mission: చంద్రయాన్-3 సక్సెస్‌ అయిన తర్వాత.. సూర్యూనిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా 'ఆదిత్య ఎల్‌1' ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదిత్య ఎల్1 తన ప్రయాణంలో చివరి దశకు (Final Stage) చేరుకుంటోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్ వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్‌1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. భారత్‌ నుంచి మొదటిసారిగా రాకెట్ ప్రయోగాన్ని చేపట్టి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పెస్‌ సెంటర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ (S Somanath) పాల్గొన్నారు.

ప్రస్తుతం ఆదిత్య ఎల్‌1 వ్యోమనౌక తన మార్గంలో దూసుకెళ్తోందని.. దాదాపు చివరికి దశకు చేరుకుందని భావిస్తున్నానని తెలిపారు. దాన్ని ఎల్‌1 పాయింట్‌ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు చివరి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 7 నాటికి తుది విన్యాసాలు పూర్తి చేస్తామని వివరించారు. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సక్సెస్‌ తర్వాత సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్‌1 ప్రయోగాన్ని చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీసీ-57 వాహననౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. సౌర వాతవరణంలో లోతుగా అధ్యయనం చేయడమే ఈ ఆదిత్య ఎల్‌1 లక్ష్యం. ఇక ఇండియా తరఫున సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే.

Also Read: సంచలనంగా మారిన బర్రెలక్క రామక్క పాట.. హోరెత్తుతోన్న ప్రచారం!

భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్‌ పాయింట్-1 చేరిన తర్వాత .. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్‌1 అధ్యయనం మొదలుపెడుతుంది. అయితే ఈ వ్యోమనోకలో మొత్తంగా ఏడు పేలోడ్లు ఉన్నాయి. సౌరవాతావరణం, సౌరజ్వాలలు, కరోనల్, మాస్ ఎజెక్షన్ తదితర విషయాలపై పరిశోధనలు చేసేందుకు ఇవీ ముఖ్యమైన సమాచారాన్ని అందించనున్నారు.

Also read: తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ.

Advertisment
తాజా కథనాలు