Latest News In Telugu Aditya L1 : తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1.. త్వరలోనే విన్యాసాలు.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌకను ఎల్1 పాయింట్లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya L1 Mission: గమ్యస్థానానికి చేరువైన ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్..విజయవంతంగా ఐదోకక్ష్యలోకి ఎంట్రీ..!! ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌకను ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది భారతదేశపు తొలి సన్ మిషన్ కావడం గమనార్హం. ఇది సూర్యుని రహస్యాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. ఆదిత్య-ఎల్1 విజయవంతంగా ఐదోసారి తన కక్ష్యను మార్చుకుంది. దీనిని ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I) అని పిలుస్తారు. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 మిషన్ విజయం దిశగా మరో ముందడుగు..!! భారతదేశం యొక్క సౌర మిషన్ ఆదిత్య L-1 నాల్గవసారి విజయవంతంగా కక్ష్యను మార్చింది. శుక్రవారం అర్థరాత్రి మిషన్ ఈ ప్రక్రియను చేపట్టింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఈ సమాచారాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. కక్ష్య మార్పు ప్రక్రియ కోసం నాలుగోసారి థ్రస్టర్లను కాల్చినట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో బెంగళూరు, మారిషస్, పోర్ట్ బ్లెయిర్ స్టేషన్ల నుండి ఈ ప్రక్రియను ట్రాక్ చేశారు. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya-L1 Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో... గాల్లోకి దూసుకెళ్లిన ఆదిత్య L -1..!! ఇస్రో చరిత్ర సృష్టించింది. ఆదిత్య మిషన్ సక్సెస్ అయ్యింది. దీంతో భారత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. ఆదిత్య మిషన్ విజయవంతం అవ్వడంతో యావత్ భారతం సంబురాలు జరుపుకుంటోంది. By Bhoomi 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Aditya-L1 Mission: ఆదిత్య మిషన్ వైపే ప్రపంచం చూపు...మరోసారి హిట్టు కొట్టినట్లేనా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తన మొదటి సన్ మిషన్ 'ఆదిత్య-ఎల్ 1' ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ మిషన్‌ను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారతదేశం యొక్క ఈ మొదటి సోలార్ మిషన్‌తో ఇస్రో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఈ మిషన్ విజయవంతం అయినట్లే భారత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తుంది. By Bhoomi 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aditya L1 Mission: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం.. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు! ఆదిత్య L1 ప్రయోగానికి ముందు తిరుమలకు వెళ్లింది ఇస్రో శాస్త్రవేత్తల బృందం. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు సైంటిస్టులు. చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఇలానే వెళ్లారు. గత జులై 13న నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn