ISRO: ఇస్రోకు లాభాల పంట.. ఛైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ఇస్రోకి లాభాల పంట పండుతోంది. ఈ సంస్థపై రూపాయి పెట్టుబడి పెడితే.. దానికి 2.54 లాభం వస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇది సమాజానికి కూడా ఆర్థికంగా లాభం చేకూరుస్తోందని పేర్కొన్నారు.

New Update
ISRO: ఇస్రోకు లాభాల పంట.. ఛైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు లాభాల పంట పండుతోంది. ఇస్రోపై ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికి భారీగా లాభం వస్తుందని.. ఆ సంస్థ ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఇస్రోపై రూపాయి పెట్టుబడి పెడితే.. దానికి 2.54 లాభం వస్తుందని పేర్కొన్నారు. సమాజానికి కూడా ఇది ఆర్థికంగా లాభం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. ఫ్రాన్స్‌కు చెందిన నోవాస్పేస్‌ సంస్థ ఇటీవల భారత్‌లో ఇస్రో ఆర్థిక, సామాజిక ప్రభావం అనే అంశంపై ఇటీవల ఓ నివేదికను ప్రచురించింది. ఈ పరిశోధనను ఇస్రో సంస్థనే చేయించి దాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే సందర్భంగా దీన్ని విడుదల చేశారు.

Also Read: అచ్యుతాపురం పేలుడు ఘటన.. కనికరం చూపించని కంపెనీ యాజమాన్యం

గత పదేళ్లలో భారత అంతరిక్ష పరిశోధ సంస్థ 60 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనాలు అలాగే 47 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు ఈ నివేదిక తెలిపింది. అలాగే 24 బిలియన్ డాలర్ల విలువైన పన్ను ఆదాయం కూడా తీసుకొచ్చినట్లు పేర్కొంది. రానున్న పదేళ్లలో పరిస్థితులను బట్టి ఇస్రో.. భారత ఆర్థిక వ్యవస్థకు 89 బిలియన్ డాలర్ల నుంచి 131 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చవచ్చని అంచానా వేసింది. అంతేకాదు భారతీయుల రోజువారీ జీవితాల్లో శాటిలైట్ ఆధారిత అప్‌డేట్లు సైతం కీలక భాగస్వామిగా అయ్యాయని ఈ రిపోర్టు స్పష్టం చేసింది.

నోవాస్పేస్ ప్రధాన నిపుణుడు స్టీవ్ బౌచర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' గడిచిన 55 ఏళ్లలో ఇస్రో కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం సొమ్ము.. అమెరికాకి చెందిన నాసా ఏడాది బడ్జెట్ కంటే తక్కువే. ఇప్పుడు ఇస్రో వార్షిక బడ్జెట్ 1.6 బిలియన్ డాలర్లు. నాసా బడ్జెట్ 25 బిలియన్ డాలర్లు. అంటే ఇస్రో కన్నా నాసా బడ్జెట్‌ దాదాపు 23.4 కోట్లు ఎక్కువ. 2023 డిసెంబర్‌ 31 నాటికి ఇస్రో 127 భారతీయ శాటిలైట్స్‌ను ప్రయోగించింది. ఇందులో ప్రైవేటు సంస్థలవి, అలాగే పలు విద్యా సంస్థలవి కూడా ఉన్నాయి. మూడు డీప్‌ స్పేస్‌ మిషన్లకు కూడా ఇస్రో వేదికగా మారింది.

Also Read: పాలిగ్రాఫ్‌ టెస్టు అంటే ఏంటీ.. ఎలా చేస్తారు ?

వీటిలో 50 ఉపగ్రహాల విలువ రూ.50 వేల కోట్ల కన్నా ఎక్కువే. ఇవి వాతావరణం, తుఫాన్‌లపై నిఘా పెట్టడం, ఏటీఎంలు, పంటల దిగుబడి అంచనాలు వేయడం అలాగే స్మార్ట్‌ సిటీ ప్లానింగ్ వంటి రంగాల్లో కూడా పనిచేశాయి. దాదాపు 8 లక్షల మంది రోజువారి మత్స్యకారులకు ఈ ఉపగ్రహ సమాచారం ఉపయోగపడుతోంది. మొత్తం 97 రాకెట్ల సాయంతో 432 విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టిందని'' వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు