ఈ ఏడాది కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... ఎన్నో ప్రత్యేక మిషన్లను నిర్వహించాం...!

ISRO: చంద్రయాన్-3ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు.

author-image
By G Ramu
New Update
ఈ ఏడాది కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... ఎన్నో ప్రత్యేక మిషన్లను నిర్వహించాం...!

ISRO: చంద్రయాన్-3 (Chandrayaan 3)ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ (Somanath) అన్నారు. కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వీని విజయవంతం చేశామన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు.

గత స్వాతంత్ర్య దినోత్సవం (2022) నుండి ఇప్పటి వరకు తాము అనేక మిషన్స్ ను సక్సెస్ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో విజయాలను సాధించామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది తాము కేవలం రికార్డులను బద్దలు కొట్టడమే కాదు అనేక ప్రత్యేక మైన మిషన్లను కూడా నిర్వహించామన్నారు. గత ఏడాదిలో మీరు సాధించిన అద్భుతమైన విజయానికి ఇస్రో(ISRO) కేంద్రాలు, అంతరిక్ష శాఖలోని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

సంఖ్యా పరంగా ఈ ఏడాది అత్యధికంగా శాటిలైట్లను నిర్మించి ప్రయోగించామన్నారు. తాము ఎల్వీఎం-3 (LVM-3) ద్వారా ప్రపంచ వాణిజ్య మార్కెట్ పై ఆధిపత్యం సాధించగలిగామన్నారు. తాము ఓషియన్ శాట్-3ని ప్రయోగించామన్నారు. ఇది ఇంజినీరింగ్ పరంగా ఓ అద్బుతమన్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఆదిత్య-ఎల్ -1 (Aditya L-1)ను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని అద్బుతాలు సృష్టిస్తామన్నారు. భారత తొలి పొలారిమెట్రీ మిషన్ ప్రయోగానికి రెడీగా వుందన్నారు. వాతావరణంపై అధ్యయనం చేసేందుకు మరో ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ ను ప్రయోగిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ మిషన్‌ను ప్రయోగిస్తామన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అన్‌క్రూడ్ మిషన్‌కు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. నాసాతో కలిసి NISAR అనే మిషన్ ను ప్రారంభిస్తామన్నారు.

Also Read: చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్

Advertisment
తాజా కథనాలు