Israel-Hamas War: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న వేళ.. భారత్ తమకు మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ రాయబారి హర్షం చేశారు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదని.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహాత్మక విషయాల్లో ఇజ్రాయెల్-భారత్ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాయని చెప్పారు.

Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్..
New Update

గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తున్న వేళ.. తమ కార్యకలాపాలకు భారత్ మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే హమాస్‌పై భారత్ కూడా కఠిన వైఖరిని అనసరించాలని అభ్యర్థిస్తోంది. ఇతర దేశాలు చేసినట్లుగానే భారత్ కూడా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమైన దేశాలన్ని కూడా మనతోనే ఉన్నాయి. అవి ప్రజాస్వామ్య దేశాలు. అయితే ఇప్పుడు ఇండియా కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను అని మీడియాతో మాట్లాడుతూ గిలన్ వ్యాఖ్యానించారు.

Also Read: రూ.8 కోట్ల నోట్ల కట్టల వర్షం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?

ఇప్పటికే అమెరికా, కెనడా, ఐరోపా సమాఖ్య వంటివి హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించేశాయని చెప్పారు. అయితే దీనికి సంబంధించి తాము ఇప్పటికే కొంతమంది అధికారులతో కూడా మాట్లాడామని చెప్పారు. హమాస్ దాడి జరిగిన అనంతరం దాని గురించి ఇక్కడి అధికారులతో మాట్లాడుతున్నామని.. ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ చర్చ స్నేహపూర్వకంగా ఉందని తెలిపారు. నా అంచనా ప్రకారం.. మన రెండు దేశాలు ఉగ్రముప్పును అర్థం చేసుకున్నాయని అన్నారు. అయినప్పటికీ కూడా ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదని.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహాత్మక విషయాల్లో తాము ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నామని చెప్పారు.

ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రతికారంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు గాజాపై భీకర పోరు చేస్తోంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహు.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు . అలాగే ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్-పాలస్తీనాకు సంబంధించిన విషయంలో తమ వైఖరి స్థిరంగా ఉన్నట్లు ఇటీవలె భారత్ తెలిపింది. అలాగే పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడానికి మద్ధతు ఇస్తున్నామని చెప్పింది. గాజా ప్రజలకు అండగా ఇటీవల భారత్ మానవతా సాయం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని.. అలాగే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా ఉపేక్షించకూడదని భారత్ పేర్కొంది.

#telugu-news #israel-hamas-war #hamas-vs-israel #hamas-israel-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe