Israel-Hamas war:హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను కనిపెట్టేశారు

హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరు ఎంత చెప్పినా ఇరు వర్గాలు వార్ ను ఆపడం లేదు. సంధికి కూడా ఒప్పుకోవడం లేదు. హమాస్ ను మట్టుబెట్టేంతవరకు ఊరుకునేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ క్రమంలో హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను బయటపెట్టింది.

Israel-Hamas war:హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను కనిపెట్టేశారు
New Update

హమాస్ రహస్య స్థావరాలను నెమ్మదిగా కనుక్కొంటోంది ఇజ్రాయెల్ సైన్యం. గాజాలో అణువణువూ సోధిస్తోంది. అన్ని రహస్య స్థావరాలను బయటపెట్టి హమాస్ ను పూర్తిగా నాశనం చేయాలని అనుకుంటోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో హమాస్ నెట్ వర్క్ ను ఛేధిస్తున్నాయి ఇజ్రాయెల్ దళాలు. ఇందులో భాగంగా సిటీలోని హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్ బయటపెట్టింది. దీని నుంచే వాళ్ళ భూగర్భ సొరంగ నెట్ వర్క్ మొత్తాన్ని నిర్వహిస్తోందని ఐడీఎఫ్ తెలిపింది. అయితే ఇది ఎక్కడుందో మాత్రం ఇజ్రాయెల్ చెప్పడం లేదు.

Also Read:మీహిందీని మీరే ఉంచుకోండి..బీహార్ సీఎంకు కౌంటరిచ్చిన సద్గురు

మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల మీద అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హమాస్ కోసం సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని అంటున్నారు. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గితే బావుంటుందని సూచించాయి. ఇక గాజాలో చనిపోయిన వారి సంఖ్య 20వేలకు చేరింది. ఇందులో 8 వేల మంది చిన్నారులు మృతి చెందారు. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లో దాడులు చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాలో దాడులు చేస్తూనే ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే..బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ మరొక ఒప్పందాన్ని ప్రతిపాదించిందని తెలుస్తోంతది. హమాస్ దగ్గర ఉన్న 40 మంది బందీల విడుదల కోసం 7 రోజుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రతిపాదించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో వచ్చింది. అయితే దీన్ని హమాస్ తిరస్కరించిందని సమాచారం. గాజాలో తమ మీద ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆపేస్తేనే సంధి గురించి చర్చిస్తామని హమాస్ చెబుతోంది. దాంతో పాటూ ఇజ్రెల్ జైళ్ళల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ అప్పగిస్తేనే తమ దగ్గర బందీలుగా ఉన్నవారిని విడిచిపెడతామని అంటోంది హమాస్.

ఇజ్రాయెల్-హమాస్ వార్ మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. దగ్గరలో ఇద్దరి మధ్యా సంధి జరిగే సూచనలు కనిపించడం లేదని బైడెన్ అన్నారు. తాము కూడా ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే యూఎస్ సీఐఏ, ఇజ్రాయెల్ మొస్సాద్, ఖతార్ ప్రధాని సమావేశం కానున్నారని చెప్పారు.

#war #israel #bunker #hamas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe