Israel-Hamas War: అది ఆసుపత్రి కాదు.. హమాస్ ఉగ్రవాద కార్యాలయం: ఇజ్రాయెల్

గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ.. ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ చెబుతోంది.

New Update
Israel-Hamas War: అది ఆసుపత్రి కాదు.. హమాస్ ఉగ్రవాద కార్యాలయం: ఇజ్రాయెల్

Israel-Hamas War: హమాస్‌ సంస్థను నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. గాజాలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ‘అల్‌- షిఫా’ (Al Shifa hospital).. కేవలం హాస్పిటల్‌ మాత్రమే కాదని.. అది హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తోందని ఆరోపణలు చేసింది. ఆసుపత్రి భవనం కింద భూగర్భంలో ఓ నివాసం ఉన్నట్లు ఐడీఎఫ్‌ ఓ వీడియోను బయటపెట్టంది. గాజాలో (Gaza) ఉన్నటువంటి రహస్య ఉగ్రవాద స్థావరాలను బట్టబయలు చేస్తామని హెచ్చరికలు చేసింది. మరోవైపు గాజాలో శుక్రవారం రాత్రి వైమానిక దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో హమాస్‌ ఉగ్రవాది అబు రకాబా హతమైనట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

Also Read: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు

హమాస్ యూఏవీలు, డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఏరియల్ డిటెక్షన్, డిఫెన్స్‌కు అతడే బాధ్యత వహించాడని చెప్పింది. అలాగే అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిపిన మెరుపు దాడిలో అబు రకాబా హస్తం ఉందని.. పారాగ్లైడర్‌లతో ఇజ్రాయెల్‌లోకి చొరబడినటువంటి ఉగ్రవాదులకు అతడే సూచనలు చేశాడని పేర్కొంది. ఇజ్రాయెల్‌ పోస్ట్‌లపై డ్రోన్ దాడులకూ బాధ్యత వహించినట్లు ఆరోపణలు చేసింది. మరోవైపు ఇంధనం, ఆహారం, విద్యుత్‌ కొరతతో అల్‌- షిఫా ఆసుపత్రిలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు పౌరులు అక్కడికి పెద్దఎత్తున తరలివస్తుండటంతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.

ఇజ్రాయెల్‌తో పోరుకు సిద్ధమే: హమాస్‌
గాజాపై భూతల దాడులకు రెడీగా ఉన్నామని చెప్పిన ఇజ్రాయెల్‌ (Israel).. ఆ దిశగా దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే కొన్ని లక్ష్యాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు తాము కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు తాజాగా హమాస్‌ కూడా ప్రకటించేసింది. ప్రస్తుతం హమాస్‌ మిలిటరీ విభాగంలో ఉన్న అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్లు అలాగే ఇతర బలగాలు.. ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. నెతన్యాహు, అతడి సైన్యం గాజాలో ఎలాంటి విజయాన్ని సాధించలేరని పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు