Delhi Israel Embassy:ఢిల్లీ ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర భారీ పేలుడు..అప్రమత్తంగా ఉండాలంటోన్న అడ్వైజరీ

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతఓ అక్కడ కఒంతసేపు పాటూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది.

Delhi Israel Embassy:ఢిల్లీ ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర భారీ పేలుడు..అప్రమత్తంగా ఉండాలంటోన్న అడ్వైజరీ
New Update

భారత దేశంలో ఉంటున్న ఇజ్రాయెల్ పౌరుల భద్రంగా ఉండాలని..తమ జాగ్రత్తకు చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. పబ్లిక్ ప్లేసులు, పార్టీలు, ఈవెంట్లకు వెళ్ళొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ బుధవారం హిబ్రూ భాషలో ఒక అడ్వైజరీ జారీ చేసింది. నిన్న సాయంత్రం ఇజ్రాయేల్ ఎంబసీ వద్ద భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎంబసీ ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. ఎంబసీ ఆఫీసు వెనకాల ఉన్న పృథ్వీరాజ్‌ రోడ్డులో బాణాసంచా పేలిందని అందుకే శబ్దం వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దురాగతాలు తమకు తెలుసని పేలుడు ప్రాంతంలో ఒక లేఖ కూడా దొరికిందని అధికారులు చెబుతున్నారు.

Also Read:ఐసోలేషన్ లో ఉండాల్సిందే..కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్స్

దౌత్యకార్యాలయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, కేసు దర్యాప్తు చేసేందుకు స్థానిక అధికారులతో సహకరిస్తున్నామని ఇజ్రాయేల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంబసీ దగ్గర పేలుడు దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని ఆ దేశ ఎంబసీ వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంతకు ముందు అక్టోబరు 23న పాలస్తీనా పౌరులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టింది. అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ చేసిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌లోని బిహార్‌, కోల్‌కత్తాలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి.

#delhi #israel #attack #bomb #embassy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe