Israel: ఒకేరోజు 50 మంది ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్

హమాస్ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గింది. తమ దగ్గర బందీలను 50 మందికి పైగా ఖైదీలను విడుదల చేసింది. అందులో హమాస్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో బందీగా తీసుకెళ్లిన అల్‌-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్‌ అబు సల్మియాను ఇజ్రాయెల్‌ తాజాగా విడుదల చేసింది.

Israel: ఒకేరోజు 50 మంది ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
New Update

పాలెస్తీనా, హమాస్ పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాల పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. దీంతో పాలస్తీనా విషయం కాస్త వెనక్కు తగ్గింది. తమ దగ్గర బందీలను 50 మందికి పైగా విడుదల చేసింది. వారిలో గాజాలోనే అతిపెద్దదైన అల్‌-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్‌ అబు సల్మియా కూడా ఉన్నారు. ఏడు నెలల క్రితం అతనిని ఇజ్రాయెల్‌ సైన్యం బందీగీ చేసుకుంది. సల్మియాతో పాటు విడుదలైన ఖైదీలను ఇజ్రాయెల్‌కు తూర్పు సరిహద్దులోని ఖాన్‌ యూనిస్ మార్గం ద్వారా గాజాలోకి పంపారు. ఈ మేరకు గాజాలోని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇజ్రాయెల్ చెర నుంచి విడుదల అయిన బందీలను ఖాన్-యూనిస్‌లోని ఆస్పత్రుల్లో ఉంచారు. వీరితో పాటూ మరింత మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు సైన్యం తెలిపింది. దీనిని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఇటామర్ బెన్ కూడా ధ్రువీకరించారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో అల్‌-షిఫా ఆస్పత్రి వార్తల్లో నిలిచింది. పసిబిడ్డలు సహా 179 మంది మృతులను ఇక్కడి ప్రాంగణంలోనే సామూహికంగా ఖననం చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ మహ్మద్‌ అబు సల్మియా అప్పట్లో మీడియాకు వెల్లడించారు. అనంతరం అతడిని ఇజ్రాయెల్‌ సైన్యం కస్టడీలోకి తీసుకుంది. తాజాగా విడుదల చేసింది.

Also Read:Maharastra: దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత

#palistina #gaza #hamas #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe