Israel-Hamas War: వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్...తెరుచుకున్న రఫా దారులు

ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం వణుకుతోంది. ఉత్తర గాజాలో దాడులు చేస్తాము అక్కడి నుంచి తరలివెళ్ళిపోండి అని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించింది ఇజ్రాయెల్. దీంతో అక్కడి ప్రజలంతా 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అక్కడ కూడా దాడులు చేస్తోంది. దీంతో పాలస్తీనియన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా చెప్పిన మాటలను కాస్త చెవికి ఎక్కించుకుని గాజాకు మానవతా సహాయం చేసేందుకు రఫా దారులను ఓపెన్ చేసింది.

New Update
Israel-Hamas War: వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్...తెరుచుకున్న రఫా దారులు

Rafah Border Crossing Opened: ప్రపంచదేశాలు, ఐరాసల ప్రయత్నాలు ఫలించాయి. ఇజ్రాయెల్ కాస్త శాంతించింది. గాజాలో (Gaza) నానాపాట్లు పడుతున్న పాలస్తీనియన్లకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రఫా పాయింట్ (Rafah crossing) దగ్గర సరిహద్దులను ఓపెన్ చేసింది. దీంతో నిత్యవసరాలు, మందులతో కూడిన 20 ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయి. ట్రక్కులు గాజాలో ఎంటర్ అవుతున్న వీడియోలను ఈజిప్టు (Egypt) ప్రభుత్వం ప్రసారం చేసింది. అయితే అక్కడ 200కు పైగా ట్రక్కులు ఉండగా అందులో కేవలం 20 ట్రక్కులను మాత్రమే ఇజ్రాయెల్ అనుమతించింది.

Also Read:  వారానికి ఒకసారి ఈ పండు తినండి.. అందంతోపాటు ఆరోగ్యాన్నీ పొందండి

గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ (Israel) ఆధీనంలో లేని దారి రఫా ఒక్కటే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రూట్ దగ్గర నిత్యవసరాలతో ట్రక్కులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి. ఇన్నాళ్ళు వాటిని గాజాలోకి వచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి, అమెరికా విజ్ఞప్తిలతో ట్రక్కులు వచ్చేందుకు మొత్తానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ట్రక్కుల్లోని వస్తువులను చిన్న చిన్న మోటార్ల మీద తరలిస్తున్నారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1400 మంది మరణించగా.. 200 మంది కిడ్నాప్‌కి గురయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతోన్న బాంబుల దాడుల్లో 4,385 మరణించారని, వారిలో 1,756 మంది చిన్నారులున్నారని పాలస్తీనియన్ అధికారులు చెప్పారు. ఇక గాజాలో తినేందుకు తిండి లేక, తాగేందుకు శుభ్రమైన నీరు లేక 23 లక్షల మంది అవస్థలుపడుతున్నారు.

మరో ఇద్దరిని విడిచిపెడతాం...

నిన్న హమాస్ తమ దగ్గర బందీలుగా ఉన్నవారిలో ఇద్దరు అమెరికన్లను (Americans) విడిచిపెట్టింది. మరో ఇద్దరిని విడిచిపెట్టేందుకు కూడా రెడీగా ఉన్నామని చెబుతోంది. ఈ విషయం గురించి హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఉబైదా మాట్లాడుతూ...మానవతా ప్రాతిపదికన నిన్నటిలాగే మరో ఇద్దరు బందీలను విడిచిపెడతామని చెప్పినా ఇజ్రాయెల్ స్పందించడం లేదని చెప్పారు. అలాగే ఇజ్రాయెల్ బాంబు దాడులను ఆపితే బందీలందరినీ వదిలేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు