Israel:హమాస్ చెర నుంచి తమ దేశ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్

హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈక్రమంలో తమ దేశానికి చెందిన ఓ సైనికురాలిని సైన్యం విడిపించుకుంది. మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.

Israel:హమాస్ చెర నుంచి తమ దేశ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్
New Update

గాజాలో హమాస్ స్థావరాల మీద ఇజ్రాయెల్ వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. గాజాస్ట్రిప్ లో అడుగుపెట్టి ఇల్లిల్లూ గాలిస్తూ మరీ మెరుపు దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ సైనికురాలు ఒరి మెగిదిష్‌ను ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ విడిపించుకుంది. అక్టోబర్ 7న హమాస్ ఈమెను అపహరించింది. ఒరి మెగదీష్ ను విడిపించుకున్నాక తమ దేశం తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. వైద్య పరీక్షలు అనంతరం ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మెగదిష్ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read:రోజురోజుకూ పైపైకే బంగారం ధరలు

ఇక హమాస్ చెరలో ఇప్పటివరకు 239 మంది బందీలుగా ఉన్నారు. అందులో 33 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులే కాక విదేశీయులు కూడా ఉన్నారు. హమాస్ బందీల్లో కొంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల ఎదుటనే దారుణంగా చంపారు. మిగతావారిని చీకటి గదుల్లో బందీలుగా ఉంచారని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ మధ్యనే బందీలుగా ఉన్నవారిలో హమాస్ ఇద్దరు అమెరికన్లను, మరో ఇద్దరు ముసలివారిని విడిచిపెట్టారు. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేస్తే తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ దగ్గర ఉన్న తమ బందీలను వదిలేవరకు దాడులు ఆపమని చెబుతోంది.

తగ్గేదే లే అంటోన్న ఇజ్రాయెల్..

మరోవైపు గాజాలో కాల్పుల విరమణ పిలుపు మీద ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించింది. కాల్పులు ఆపడం ఎట్టి పరిస్థితుల్లో జరగదని తేల్చి చెప్పింది. కాల్పులు విరమిస్తే హమాస్‌కు తాము లొంగిపోయినట్టే అవుతుందని అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. వారికి లొంగిపోతే ఉగ్రవాదానికి లొంగిపోవడమేనని స్పష్టం చేశారు. కాబట్టి యుద్ధంలో గెలిచే వరకూ ఇజ్రాయెల్ పోరుడుతుందని నెతన్యాహు తేల్చి చెప్పారు.

ఇజ్రాయెల్ కాల్పులను విరమిస్తేను గాజాకు మానవతా సాయం అందుతుందని...లేకుంటు అక్కడ పరిస్థితులు మరీ దారుణంగా తయారై మానవ సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఈ ప్రతిపాదననే తోసి పుచ్చింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ మిత్ర దేశం అమెరికా కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించడం లేదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

#war #attcks #israel #hostages #hamas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి