Israel-Hamas War: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!!

హమాస్ విషయంలో అమెరికా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పాత మిత్రదేశం. దోషులను వదిలిపెట్టబోమని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా..ఆయుధాలతో కూడిన మొదటి విమానం ఇజ్రాయెల్‌కు పంపించింది. హమాస్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అటు ఇజ్రయెల్ ప్రతికార దాడిలో 900 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించారు.

Israel-Hamas War: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!!
New Update

హమాస్ విషయంలో అమెరికా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పాత మిత్రదేశం. దోషులను వదిలిపెట్టబోమని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా..ఆయుధాలతో కూడిన మొదటి విమానం ఇజ్రాయెల్‌కు పంపించింది. హమాస్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అటు ఇజ్రయెల్ ప్రతికార దాడిలో 900 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించారు.

హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత అంతా ధ్వంసమైంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ పూర్తిగా గాజాను సీజ్ చేసింది, ఆ తర్వాత ఆహారం, నీరు, ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. హమాస్ ఉగ్రవాదుల కోసం గాజాలో ఇజ్రాయెల్ సైనికులు దాడులు నిర్వహిస్తున్నారు. హమాస్ దాడిలో వెయ్యి మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. చాలా మందిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. మరణించిన వారిలో 156 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగ…ప్రాధాన్యత..!!

అదే సమయంలో హమాస్‌కు గట్టి వార్నింగ్ ఇస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించలేదని, అయితే కచ్చితంగా ముగిస్తామని నెతన్యాహు స్పష్టంగా ప్రకటించారు. హమాస్‌పై ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్ 3,00,000 మంది సైనికులను సమీకరించింది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అది అత్యంత క్రూరమైన రీతిలో మనపై విధించిందని నెతన్యాహు అన్నారు.

ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో కొలువుల జాతర..495 పోస్టులకు రిక్రూట్ మెంట్..!!

కాగా అమెరికా ఆయుధాలతో కూడిన తొలి విమానం మంగళవారం సాయంత్రం దక్షిణ ఇజ్రాయెల్‌లో దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపింది. అమెరికా ఆయుధాలతో కూడిన తొలి విమానం ఈ సాయంత్రం దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెవాటిమ్ ఎయిర్‌బేస్‌కు చేరుకుందని ఐడిఎఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అటు ఇజ్రాయెల్‌లో 14 మంది అమెరికన్లు మరణించారు. అదే సమయంలో, చాలా మంది బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడులను ఖండిస్తూ, యూదులను చంపడమే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటిత లక్ష్యం అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మంగళవారం అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్ నివాసితుల జీవితాలపై విధ్వంసం సృష్టించింది. రాకెట్ దాడులు తీవ్రం కావడంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి నెలకొంది.

#gaza #palestine #israel-hamas-war #benjamin-netanyahu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe