Israel-Hamas War: హమాస్ ఎదురు దాడులు.. 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పౌరుల మరణాలు తగ్గకపోతే మద్దతు కోల్పోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. By B Aravind 14 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారలేదు. హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా.. ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు కూడా ప్రతిదాడులు చేస్తున్నారు. ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానికి దాడులపై కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) హెచ్చరించారు. ఇరువైపుల పౌర మరణాలు తగ్గకపోతే.. ప్రపంచ దేశాల మద్దతు ఉండని చెప్పారు. అయితే మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. వేరే చోట మరొకరు మరణించారు. అయితే ఇప్పటికే 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో చనిపోయారు. భూతల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరుక జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌కు (Israel) కూడా గట్టి దబ్బే తగిలింది. Also read: హమాస్-ఇజ్రాయెల్ వార్.. దానికే ఓటేసిన భారత్ ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు అనూకులంగా ఉంటున్న అగ్రరాజ్యం అమెరికా మాటల్లో కూడా మార్పులు వస్తున్నాయి. రెండువైపుల విచక్షణా రహిత బాంబు దాడులు చేసుకోవడం వల్ల అంతర్జాతీయంగా ఉన్నటువంటి మద్దతును కోల్పోవాల్సి వస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ మంగళవారం నాడు హెచ్చరికలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేసిన కొన్ని గంటలకే బైడెన్ ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశమవుతోంది. Also read: రైతు నుంచి రాజస్థాన్ డిప్యూటీ సీఎం వరకూ..డాక్టర్ ప్రేమ్‌చంద్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇజ్రాయెల్ దేశం తమ భద్రతకు సంబంధించి అమెరికాపై ఆధారపడొచ్చు.. అయితే ఇప్పుడు అమెరికా కంటే కూడా మిగతా దేశాల మద్దతు ఇజ్రాయెల్‌కు ఉందని బైడెన్ అన్నారు. యూరప్ దేశాలు ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయని.. కానీ ఆ మద్దతును మాత్రం ఇజ్రాయెల్ క్రమంగా కోల్పోతుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు. ఇళ్లల్లోనే గాజా పౌరులను ఉంచి దాడులు చేస్తూ అణిచివేయడాన్ని ఆపాలంటూ సూచనలు చేశారు. 2001 సెప్టెంబర్ 11 న తర్వాత ఆ సమయంలో అమెరికా తప్పులు చేసినట్లుగా.. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చేయకూదంటూ సూచించారు. #telugu-news #joe-biden #israel-hamas-war #hamas-israel-war #hamas-israel-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి