Israel-Hamas war:యుద్ధానికి నాలుగురోజులు విరామం..ఇజ్రాయెల్‌–హమాస్‌ ఒప్పందం

మొత్తానికి సంధి కుదిరింది...గాజా మీద ఆరు వారాలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగివచ్చింది. నాలుగురోజుల పాటూ కాల్పులను విరమించేందుకు అంగీకరించింది. దీనికి బదులుగా తమ చెరలో ఉన్న 50 బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది.

New Update
Israel-Hamas war:యుద్ధానికి నాలుగురోజులు విరామం..ఇజ్రాయెల్‌–హమాస్‌ ఒప్పందం

ప్రపంచదేశాల ప్రయత్నాలు, విజ్ఞప్తులు పనికి వచ్చాయి. కాల్పులు, బాంబుల మోతలు, చావుకేకలు, ఆర్తనాదాలు, రోదనల నుంచి గాజాకు కాస్త విరామం దొరికింది. నాలుగు రోజుల పాటూ యుద్ధానికి సెలవు ప్రకటించింది ఇజ్రాయెల్. ఈ మేరకు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఇజ్రాయెల్‌ నాలుగు రోజుల పాటు కాల్పులను పూర్తిగా ఆపేస్తుంది. దానికి బదులుగా హమాస్‌ తన చెరలో ఉన్న 240 మంది బందీల్లో నుంచి 50 మందిని విడిచిపెడుతుంది అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కార్యాలయం తెలిపింది. బందీలందరినీ విడిపించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్‌ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈజిప్టు, అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ గురువారం ఉదయం నుంచి మొదలవుతుంది.
Also read:అంతుచిక్కని నిమోనియాతో మళ్ళీ భయపెడుతున్న చైనా.

హమాస్ విడుదల చేసే బందీల్లో ఎక్కువగామహిళలు, పిల్లలే ఉంటారు. ఇజ్రాయెల్‌ కూడా పాలస్తీనా మహిళలు, పిల్లలను విడిచి పెట్టనుందని ఖతర్‌ వెల్లడించింది. మరోవైపు నిత్యావసరాలు, నీరులేక అల్లల్లాడుతున్న గాజాకు ఈ నాలుగు రోజుల్లో అదనపు సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించినట్టు ఖతర్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఒప్పందం కంటిన్యూ అవుతుందా...యుద్ధం శాశ్వతంగా ఆగిపోతుందా అంటే సమస్యే లేదంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. యుద్ధాన్ని ఆపేది లేదని నాలుగు రోజులు పూర్తవ్వగానే గాజాలో దాడులు మళ్ళీ మొదలవుతాయని స్పష్టం చేశారు. హమాస్ ను శాశ్వతంగా నిర్మూలించేదాకా మా యుద్ధం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక యుద్ధానికి సైన్యం మరింతగా సన్నద్ధమయ్యేందుకు విరామం ఉపయోగపడుతుంది తప్ప సైనికుల స్థైర్యాన్ని తగ్గించబోదని ఆయన అన్నారు. అయితే హమాస్‌ చెరలోని బందీల్లో ప్రతి 10 మంది విడుదలకు ప్రతిగా కాల్పుల విరామాన్ని ఒక రోజు చొప్పున పెంచేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది.

అయితే ఒకసారి కాల్పులను విరమిస్తే...మళ్ళీ మొదలుపెట్టడం కష్టమని అంటున్నారు పరిశీలకులు. 50 మంది బందీలు విడుద లఅయితే మిగతా వారిని కూడా వడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందని అంటున్నారు. కానీ హమాస్ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా తీసుకుని విజయంగా ప్రచారం చేసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అది ఇజ్రాయెల్ ను కవ్వించడమే అవుతుందని...దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.

ఇక బందీల విడుదల కోసం ఒప్పందం ఖరారైన కొద్ది గంటలకే హమాస్‌ నిర్బంధంలో ఉన్న 77 ఏళ్ల ఇజ్రాయెలీ మహిళ హన్నా మృతిచెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూప్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌లోని నిర్‌ ఓజ్‌ అనే ప్రాంతం నుంచి హన్నా కట్జిర్‌, ఆమె కుమారుడిని హమాస్‌ కిడ్నాప్‌ చేసింది. ఆ తర్వాత వారిని గాజాకు తీసుకెళ్లి బంధించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు