ISRAEL Vs IRAN : గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి.. 22మంది మృతి! ఇరాన్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్ మరోసారి గాజాపై ప్రతీకారం తీర్చుకుంది. రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. By srinivas 22 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gaza : పశ్చిమాసియా(West Asia) లో మరింత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్(Iran-Israel) ప్రతీకార దాడులతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. రఫాలో శరణార్థి శిబిరాలపై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడగా 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్థి శిబిరాలపై భయంకరమైన దాడులు.. అలాగే వెస్ట్ బ్యాంక్(West Bank) లోనూ పాలస్తీనా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ భయంకరమైన దాడులు చేస్తోందని, వెస్ట్‌బ్యాంక్‌లోని హేబ్రోన్ చెక్‌పోస్ట్‌పై కత్తి, గన్‌తో దాడి చేసినట్లు గాజా బలగాలు తెలిపాయి. అంతేకాదు ఇద్దరు పాలస్తీనియన్లను హతమార్చినట్టు ఇజ్రాయెల్ వీడియో విడుదల చేయడం గమనర్హం. కాగా 7నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) పోరులో ఇప్పటివరకు 34వేలమందికి పైగా మృతి చెందగా.. 80శాతానికి పైగా జనాభా గాజాను వీడి వెళ్లిపోయారు. చిన్నారులు, వృద్ధులు ఆకలితో అలమటించిపోతున్నారు. ఇకనైనా దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అయినా ఐరాస విజ్ఞప్తులను పట్టించుకుండా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇది కూడా చదవండి: Indians : అమెరికా పౌరులుగా రికార్డు సృష్టించిన భారతీయులు! ప్రతీకారం మరోలా ఉంటుంది.. ఇదిలా వుంటే.. ఇరాన్, ఇరాక్‌లోనూ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఆదివారం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్- S-300ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. రాడార్ వ్యవస్థకు దొరకకుండా ఇజ్రాయెల్ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు వార్తలు వెలువడ్డాయి. నతాంజ్ న్యూ క్లియర్ ప్లాంట్ దగ్గర S-300ను ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో ఇరాన్ న్యూ క్లియర్ ప్లాంట్స్ సెక్యూరిటీ డేంజర్‌లో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఇరాక్ రాజధాని బాగ్ధాద్‌కు సమీపంలోని ఎయిర్‌బేస్‌పై అటాక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీని అలర్ట్ చేసినట్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మీడియాకు తెలిపారు. శత్రువు వ్యూహాలను పసిగట్టాలని బలగాలకు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రతీకారం మరోలా ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనే అంశం ప్రపంచ దేశాను ఉత్కంఠకు గురిచేస్తోంది. #gaza #west-asia #iran-israel #west-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి